కమెడియన్‌ వడివేలు ఇంట్లో మరో విషాదం.. వెంట వెంటనే ఇద్దరు కన్నమూత

Published : Aug 28, 2023, 03:50 PM IST
కమెడియన్‌ వడివేలు ఇంట్లో మరో విషాదం.. వెంట వెంటనే ఇద్దరు కన్నమూత

సారాంశం

హాస్యనటుడు వడివేలు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తమ్ముడు, నటుడు జగదీశ్వరన్‌(55) కన్నుమూశారు. 

ప్రముఖ హాస్యనటుడు వడివేలు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తమ్ముడు, నటుడు జగదీశ్వరన్‌(55) కన్నుమూశారు. గత కొంత కాలంగాఅనారోగ్యంతో బాధపడుతున్న జగదీశ్వరన్‌ ఆదివారం కన్నుమూశారు. కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన తమిళనాడులోని మధురైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలేయం పూర్తిగా దెబ్బతినడంతో ఆరోగ్యం విషమించి ఆయన మృతి చెందారు.

వడివేలు కమెడియన్‌గా ఎంతటి పాపులరో తెలిసిందే. స్టార్‌ కమెడియన్‌గా, కోలీవుడ్‌ని ఊపేశాడు. అయితే తన తమ్ముడు జగదీశ్వరన్‌ కూడా నటుడే. ఆయన కొన్ని సినిమాల్లో నటించారు. శింబు హీరోగా వచ్చిన `కాదల్‌ అలైవిట్టలై` సినిమాతో సహా పలు చిత్రాల్లో నటించారు. కానీ జగదీశ్వరన్‌ నటుడిగా సెట్‌ కాలేదు. సినిమా ఛాన్స్ లు రాలేదు. దీంతో కొన్నాళ్లకే ఆయన సినిమా పరిశ్రమని వదిలేశారు. సొంత ఇంటి(మధురై)కి వెళ్లిపోయారు. అక్కడ బట్టల షాపు నిర్వహిస్తున్నారు. 

లివర్‌ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. దీంతో వడివేలు ఇంట విషాదం అలుముకుంది. ఇటీవలే వడివేలు తల్లి కన్నుమూశారు. దాన్నుంచి ఇంకా కోలుకోకముందే ఇప్పుడు తమ్ముడు చనిపోవడం అత్యంత బాధాకరం.  ఇక వడివేలు ఇటీవల సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య `మామన్నన్‌`లో ఎమ్మెల్యేగా పూర్తి భిన్నమైన పాత్ర పోషించారు. సీరియస్‌ పాత్రలో కనిపించి అదరగొట్టారు. ఇప్పుడు `చంద్రముఖి2`తో రాబోతున్నారు. రాఘవ లారెన్స్ హీరోగా నటించగా, కంగనా చంద్రముఖిగా కనిపించనుంది. ఈ చిత్రం సెప్టెంబర్‌ 15న విడుదల కానుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్
Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో