తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్.. సాంప్రదాయ బద్ధంగా లంగాఓణీలో..

Published : Aug 28, 2023, 01:40 PM ISTUpdated : Aug 28, 2023, 01:47 PM IST
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్.. సాంప్రదాయ బద్ధంగా లంగాఓణీలో..

సారాంశం

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. యువత ఫిదా అయ్యే అందచందాలతో జాన్వీ కపూర్ దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ సౌత్ లో కూడా పాగా వేయాలని చూస్తోంది.

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. యువత ఫిదా అయ్యే అందచందాలతో జాన్వీ కపూర్ దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ సౌత్ లో కూడా పాగా వేయాలని చూస్తోంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. సముద్రతీర ప్రాంతంలో నరరూప రాక్షసుల లాంటి వారిని ఎదుర్కొనే యాక్షన్ డ్రామాగా కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ సాంప్రదాయ బద్దంగా లంగా ఓణిలో మెరిసింది. సినిమాలోనో, ఫోటోషూట్ కోసమో కాదు..భక్తి పారవశ్యంతో తిరువీధుల్లో జాన్వీ కపూర్ మెరిసింది. నేటి ఉదయం జాన్వీ కపూర్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంది. నెలల వ్యవధిలో జాన్వీ కపూర్ శ్రీవారిని దర్శించుకోవడం ఇది రెండవసారి. 

కొన్ని నెలల క్రితం జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలసి తిరుమలని సందర్శించింది. శ్రీదేవిలాగే జాన్వీ కపూర్ తరచుగా శ్రీవారిని దర్శించుకుంటూ ఉంది. తాజాగాజాన్వీ బ్లూ లంగా ఓణిలో లో ఆలయం ఎదుట కనిపించింది. విఐపి బ్రేక్ దర్శనంలో జాన్వీ కపూర్ కి అధికారులు దర్శనం కలిగేలా చేశారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. 

జాన్వీ కపూర్ తిరుమల సందర్శించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా జాన్వీ కపూర్ వరుణ్ ధావన్ సరసన బవాల్ అనే చిత్రంలో నటించింది. జూలై 21న డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే