చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ కమెడియన్ భార్య కంప్లైంట్

By Udaya DFirst Published 22, Feb 2019, 3:03 PM IST
Highlights

బుల్లితెర నటుడు, వ్యాఖ్యాత తడి బాలాజి వ్యవహారం ఇప్పటికే చాలా సార్లు మీడియాకు ఎక్కింది. పోలీస్ మెట్లు ఎక్కింది. అయితే ఎప్పటికప్పుడు సర్దుకుపోతామంటూ నమ్మబలికి మళ్లీ గొడవలు పడుతున్నారు. 

బుల్లితెర నటుడు, వ్యాఖ్యాత తడి బాలాజి వ్యవహారం ఇప్పటికే చాలా సార్లు మీడియాకు ఎక్కింది. పోలీస్ మెట్లు ఎక్కింది. అయితే ఎప్పటికప్పుడు సర్దుకుపోతామంటూ నమ్మబలికి మళ్లీ గొడవలు పడుతున్నారు. తాజాగా  తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు  బాలాజిపై అతని భార్య పోలీసులకు మళ్లీ ఫిర్యాదు చేసింది. 

వివరాల్లోకి వెళితే.... హాస్యనటుడు బాలాజీ ఓ టీవీ ఛానల్‌లో ప్రసారమవుతున్న రియాల్టీ షోలో జడ్జి గా వ్యవహరిస్తున్నాడు. అతడికి భార్య నిత్య(31), బూషిక అనే కుమార్తె ఉన్నారు. విభేదాల కారణంగా దంపతుల మధ్య తరచు గొడవలు జరుగు తుండేవి. తన భర్త వేధిస్తున్నాడని భార్య నిత్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అయితే అతనేమో విద్యుత్‌ కార్యాలయ ఉద్యోగి పైసల్‌ తో అక్రమ సంభంధం పెట్టుకుందని ఆరోపించారు. 

వీరిద్దరూ మనస్పర్థల కారణంగా ఇద్దరు విడివిడిగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలాజి నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టులో ఇటీవల నిత్య పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే పైసల్‌తో నిత్యకు అక్రమ సంబంధం ఉందని బాలాజి ఆరోపించారు. నిత్య ఒక ఎస్‌ఐ సహాయంలో తనను బెదిరిస్తున్నట్టు పోలీస్‌కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.  

అయితే ఆ మధ్యన విజయ్‌ టీవీలో ప్రసారమైన బిగ్‌బాస్‌-2లో దంపతులిద్దరు పాల్గొన్నారు. గొడవలు వద్దని జీవితంలో కలిసివెలసి వుందామని ఆ షో యాంకర్‌, నటుడు కమల్‌హాసన్‌ సూచన లివ్వడంతో బాలాజీ, నిత్య కలిసుండడానికి ఆంగీకరించారు.

ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం మాధవరం పోలీస్టేషన్‌లో మద్యం మత్తులో ఇంటికి వస్తున్న బాలాజి వస్తువులను ధ్వంసంచేసి తనను హత్య చేస్తానని బెదిరిస్తున్నట్టు నిత్య ఫిర్యాదు చేసింది.  

Last Updated 22, Feb 2019, 3:03 PM IST