'సాహో' డైలాగ్ స్పూఫ్ పై పృధ్వీ క్లారిటీ!

Published : Jun 25, 2019, 12:27 PM IST
'సాహో' డైలాగ్ స్పూఫ్ పై పృధ్వీ క్లారిటీ!

సారాంశం

సినిమాల్లో ఇతర హీరోలను ఇమిటేట్ చేస్తూ ట్రోలింగ్ కి గురవ్వడం కమెడియన్ థర్టీ ఇయర్స్ పృధ్వీకి కొత్తేమీ కాదు.. 

సినిమాల్లో ఇతర హీరోలను ఇమిటేట్ చేస్తూ ట్రోలింగ్ కి గురవ్వడం కమెడియన్ థర్టీ ఇయర్స్ పృధ్వీకి కొత్తేమీ కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోల డైలాగులను స్పూఫ్ చేస్తూ అభిమానుల ఆగ్రహానికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి.

గతంలో ఈ విషయంలో బాలకృష్ణ సైతం పృధ్వీకి వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా.. ఆది హీరోగా నటిస్తోన్న 'బుర్రకథ' అనే సినిమాలో పృధ్వీ నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో పృధ్వీ 'సాహో' టీజర్ లో డైలాగ్ 'ఫ్యాన్స్.. డై హార్డ్ ఫ్యాన్స్' అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ని ఇమిటేట్ చేశారు.

మరోసారి నెటిజన్లు తనపై ట్రోల్స్ కి దిగుతారేమోనని ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. డై హార్డ్ ఫ్యాన్స్ అనే డైలాగ్ ను దర్శకుడు సరదాగా పెట్టుకున్నాడని.. కథలో తన క్యారెక్టర్ వేరేగా ఉంటుందని అన్నారు.

టీజర్ లో డైలాగ్ చూసి ఏదేదో ఊహించుకోవద్దని చెప్పారు. కథలో తనది ముఖ్యమైన పాత్ర అని.. ఇలాంటి విషయాలని ముందుగా లీక్ చేస్తేనే బెటర్ అని చెప్పుకొచ్చారు. ప్రభాస్ ని కించపరిచేలా తమ సినిమాలో ఎలాంటి సీన్స్ ఉండవనిక్లారిటీ ఇచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం