నేను పవన్ ని ఏం అనలేదు.. నాగబాబు నాకు ఫ్రెండ్.. పృధ్వీ కామెంట్స్!

Published : Mar 14, 2019, 11:07 AM IST
నేను పవన్ ని ఏం అనలేదు.. నాగబాబు నాకు ఫ్రెండ్.. పృధ్వీ  కామెంట్స్!

సారాంశం

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలో రాజకీయంగా ఎవరు ఎలాంటి కామెంట్ చేస్తున్నా వైరల్ అవుతోంది. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలో రాజకీయంగా ఎవరు ఎలాంటి కామెంట్ చేస్తున్నా వైరల్ అవుతోంది. కమెడియన్ పృధ్వీ వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో నటుడు నాగబాబు తన కొడుకు వరుణ్ తేజ్ కలిసి పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీకి రూ.1.25 కోట్లు విరాళం అందించారు.

అయితే అది ప్యాకేజీ రూపంలో వచ్చిన డబ్బని, దాన్నే నాగబాబు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారని నటుడు పృధ్వీ కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణల గురించి నాగబాబుని అడిగితే ఆయన పృధ్వీపై ఫైర్ అయ్యారు. 'అరేయ్ పృధ్వీ నువ్ నాకు ఫోన్ చెయ్.. నేను నీకే సమాధానం చెబుతా' అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఆ వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చినట్లు పృధ్వీ తెలిపారు. నాగబాబు అంత ఆవేశంగా ఎందుకు స్పందించారో అర్ధం కాలేదని అన్నారు. రాత్రి 8 గంటల సమయంలో టీవీలో ఆ వ్యాఖ్యలు చూసి షాక్ అయినట్లు పృధ్వీ చెప్పారు. అసలు తనకు సంబంధం లేని వివాదంలో నా పేరు వినిపిస్తోందేంటని అనుకున్నా అంటూ చెప్పారు.

నాగబాబు చెప్పినట్లుగా ఆయనకి ఫోన్ చేసానని.. అలాంటి ఆరోపణలు నేను చేస్తానని మీరు అనుకున్నారా..? అని ఆయన్ని ప్రశ్నించినట్లు అక్కడితే వివాదం ముగిసిపోయిందని అన్నారు. నాగబాబు తనకు మంచి స్నేహితుడని.. ప్రజారాజ్యం పార్టీ కోసం కలిసి పని చేశామని గుర్తు చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Jagapathi Babu: నా భార్య ఎప్పుడూ నా వెంట నడవదు, ఆ రోజు చాలా బాధపడింది.. వైఫ్‌ గురించి ఓపెనైన జగపతిబాబు
Anna Lezhneva: పవన్ కళ్యాణ్ రెండేళ్ల జర్నీపై అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్, మనసులో బాధను బయట పెట్టిన పవర్ స్టార్ భార్య