వైరల్ గా కమెడియన్ మనోబాల చివరి వీడియో... ఇంత వేదన అనుభవించాడా!

Published : May 09, 2023, 09:15 PM IST
వైరల్ గా కమెడియన్ మనోబాల చివరి వీడియో... ఇంత వేదన అనుభవించాడా!

సారాంశం

కమెడియన్ మనోబాల ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన వీడియో ఒకటి వైరల్ గా మారింది. చివరి రోజుల్లో మనోబాల దీనస్థితి అనుభవించినట్లు తెలుస్తుంది.   

నటుడు, దర్శకుడు, రచయిత మనోబాల మే 3వ తేదీన కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న మనోబాల మరణించారు. ఆయన మరణం పై చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. కోలీవుడ్ కి చెందిన మనోబాల తెలుగులో కూడా నటించారు. ఆయన చివరిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ లో ఆయన జడ్జి రోల్ చేశారు. 

మనోబాల చివరి రోజుల్లో  దుర్బర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. మనోబాల వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆయన కనీసం మాట్లాడలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు ఆయన్ని మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాట పాడాలని ఉత్తేజ పరుస్తున్నారు. ఆయన వినగలుగుతున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు. చేతులు కడపలేకపోతున్నారు. 

ఆయన కుమారుడు ఒక పాటను అద్భుతంగా పాడారు. మనోబాల కొడుకు పాడిన పాటను వింటూ ఆస్వాదించారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. మనోబాల లివర్ సంబంధిత వ్యాధికి గురయ్యారు. ఇంటి వద్దే చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూసినట్లు సమాచారం. వందల చిత్రాల్లో నటించిన మనోబాల... ఇరవైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: ఎన్టీఆర్ కి చుక్కలు చూపించిన కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి, టాలీవుడ్ మొత్తం షేక్
Kriti Sanon: అల్లు అర్జున్‌పై మహేష్‌ బాబు హీరోయిన్‌ ఇంట్రెస్ట్