
చాలా కాలం తరువాత వెండితెరపై సందడి చేయబోతోంది అచ్చతెలుగు హీరోయిన్ కలర్స్ స్వాతి. క్యూట్ లుక్స్ తో టాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకుని.. తెరమరుగైన ఈబ్యూటీ మరో సారి తళుక్కున మెరవబోతోంది.
సాక్ష్యం, గూఢచారి లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. ఈ బ్యానర్ లో తెరకెక్కుతోన్న తాజా తెలుగు సినిమా ఇడియట్స్. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ సినిమాతో క్యూట్ స్టార్ కలర్స్ స్వాతి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.
అందాల తార కలర్స్ స్వాతి ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ పోషిస్తోంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథతో ఈ సినిమా రూపొందుతోంది. పోస్టర్ చూస్తుంటేనే ఈమూవీ ఫన్ ఎలిమెంట్స్ తో సాగే సినిమాగా తెలుస్తోంది. అంతే కాదు ఆడియన్స్ లో క్యూరియాసిటీని కూడా పెంచుతుంది ఈమూవీ పోస్టర్.
ఆదిత్యా హాసన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. నిఖిల్ దేవాదుల, సిద్దార్థ్ శర్మ, శ్రీ హర్ష అంటి స్టార్స్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇర ఈమూవీని అమోఘ ఆర్ట్స్ అండ్ ఎంఎన్ఓపీ కో ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సిద్దార్థ్ సదాశివుని మ్యూజిక్ అందిస్తుండగా అజమ్ మహ్మద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.