బిగ్ బాస్ కంటెస్టెంట్ కాంట్రవర్సియల్ స్టేట్మెంట్...క్షమాపణలు కోరుతూ సీఎంకి లేఖ రాసిన ఛానల్

By team teluguFirst Published Oct 30, 2020, 9:00 AM IST
Highlights

బిగ్ బాస్ కంటెస్టెంట్ భాషను ఉద్దేశిస్తూ చేసిన ఓ కామెంట్ వివాదాస్పదం అయ్యింది. దీనితో సదరు ఛానల్ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు ప్రజలకు క్షమాపణలు కోరుతూ లేఖ రాయడం జరిగింది.

సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 14 గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. సక్సెస్ఫుల్ గా సాగుతున్న ఈ షోలో మరాఠీ భాషపై ఓ కంటెస్టెంట్ చేసిన స్టేట్మెంట్ వివాదాస్పదం అయ్యింది. ప్రముఖ సింగర్ కుమార్ సాను కొడుకు జాన్ కుమార్ సాను ఈ సీజన్ లో పాల్గొనగా, మరాఠీలో మాట్లాడవద్దని ఓ కంటెస్టెంట్ ని ఆయన కోరడం జరిగింది. మరాఠీ భాషను అతని స్టేట్మెంట్ కించపరిచేలా ఉన్న నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. 

రాజకీయక ప్రముఖులతో పాటు మరాఠీ ప్రజలు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్ ఎస్ ఎన్ లీడర్ అమేయా ట్విట్టర్ వేదికగా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ముంబైలో నీకు ఎలాంటి కెరీర్ ఉండని, మరాఠీలు నిన్ను వదలరు. ఫిజికల్ కూడా నీకు శిక్ష తప్పదని ఆయన విరుచుకుపడ్డారు. అలాగే బిగ్ బాస్ ప్రసారం చేస్తున్న సదరు ఛానల్ ఆ వీడియోని తొలగించాలని డిమాండ్ చేయడం జరిగింది. 

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 14నిర్వాహకులు మరియు కలర్స్ ఛానల్ క్షమాపణలు కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి చింతిస్తున్నామన్నారు. అలాగే మహారాష్ట్ర ప్రజల మనోభావాలకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించాలని కోరారు. అలాగే మరాఠీతో పాటు దేశంలోని అన్ని భాషలను తాము గౌరవిస్తామని ఆ లేఖలో పొందుపరిచారు.  దీనితో వివాదం కొంత మేర సద్దుమణిగినట్లు అయ్యింది. 
 

click me!