తెల్లారితే గురువారం ప్రీ రిలీజ్‌: సీఎం.. సీఎం అంటూ నినాదాలు, ‘‘ ఆగండి బ్రదర్’’ అని వారించిన ఎన్టీఆర్

Siva Kodati |  
Published : Mar 21, 2021, 09:17 PM ISTUpdated : Mar 21, 2021, 09:21 PM IST
తెల్లారితే గురువారం ప్రీ రిలీజ్‌: సీఎం.. సీఎం అంటూ నినాదాలు, ‘‘ ఆగండి బ్రదర్’’ అని వారించిన ఎన్టీఆర్

సారాంశం

తెలుగుదేశం పార్టీ వరుసగా జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ ఓడిపోతుండటంతో అభిమానులు, కార్యకర్తలు నిరాశకు గురువుతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది.

తెలుగుదేశం పార్టీ వరుసగా జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ ఓడిపోతుండటంతో అభిమానులు, కార్యకర్తలు నిరాశకు గురువుతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు ఇవ్వాలనే డిమాండ్ ఊపందకుంటోంది.

ఇటీవల కుప్పం పర్యటనలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు సైతం ఈ సెగ తగిలింది. జూనియర్ ఎన్టీఆర్‌ను బరిలోకి దించండి సార్.. అంటూ చంద్రబాబును తెలుగు తమ్ముళ్లు నిలదీశారు.

తాజాగా ఇది నేరుగా ఎన్టీఆర్‌నే తాకింది. తెల్లవారితే గురువారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన జూనియర్ ఎన్టీఆర్‌ ప్రసంగిస్తుండగా.. సీఎం, సీఎం అంటూ నినాదాలు మారుమోగాయి.

ఫ్యాన్స్ నినాదాలు హోరెత్తి జూనియర్ ప్రసంగానికి అడ్డంకిగా మారడంతో ఆయన వారిని వారించారు. ఆగండి బ్రదర్స్ అంటూ వారిని ఆపేశారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని ప్రారంభించారు ఎన్టీఆర్.

కాగా, వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ నిర్మాతలుగా మణికాంత్ గెల్లి దర్శకత్వంలో ‘‘తెల్లవారితే గురువారం’’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మార్చి 27 తేదీన ఈ సినిమాను విడుదలకు సిద్ధమైంది. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే