దారుణం: రజనీ 'పేట' ఫుల్ రన్ కలెక్ష‌న్స్!

By Udaya DFirst Published Feb 3, 2019, 9:51 AM IST
Highlights

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సంక్రాంతికి 'పేట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో   జనవరి 10న విడుదల అయ్యింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సంక్రాంతికి 'పేట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో   జనవరి 10న విడుదల అయ్యింది. డిఫరెంట్ స్టైల్, మేనరిజమ్స్ ప్రదర్శిస్తూ అభిమానులను ఎంటర్టెన్ చేసే రజనీకాంత్ 'పేట'లో మరోసారి ఫ్యాన్స్ కోరుకున్న విధంగా మాస్ మసాలా వినోదం పంచబోతున్నాడని అంతా అంచనాలు వేసారు. అయితే సీన్ రివర్స్ అయ్యింది.

 

 ఈ సినిమా రజనీ పాత సినిమాలన్నీ కలిసి నూరేసిన తమిళ సాంబారు అని అర్దమైపోయింది. దాంతో తమిళనాట కొద్దో గొప్పో వర్కవుట్ అయ్యిందేమో కానీ, తెలుగులో దారుణ ఫలితం చూడాల్సి వచ్చింది.   తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 6 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ రూ. 10 కోట్లకు కొన్నారు. ఆ లెక్కన ఈ సినిమా ఓవరాల్ గా 40% నష్టాలతో డిజాస్టర్ గా నిల్చినట్లు అయ్యింది.   'పేట' కు  సంక్రాంతి సీజనే దెబ్బ కొట్టిందంటున్నారు.

స్టైయిట్ గా రిలీజైన భారీ పోటీనడుమ రిలీజ్ చేయకుండా వేరే డేట్ లో విడుదల చేసి ఉంటే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉండేదని అంటున్నారు.  '2.0' తెలుగులో నష్టాలు వచ్చినా  భారీ కలెక్షన్స్ సాధించింది.  అంత పెద్ద హిట్  సినిమా తర్వాత విడుదలైన రజనీ సినిమా పది కోట్లు కూడా రికవర్ చేయలేకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో 'పేట' క్లోజింగ్  కలెక్షన్స్  (ఏరియావైజ్)

నైజామ్: 2.36 కోట్లు

సీడెడ్: 0.81 కోట్లు

ఉత్తరాంధ్ర: 0.74 కోట్లు

కృష్ణ: 0.58 కోట్లు

గుంటూరు: 0.52  కోట్లు

ఈస్ట్ : 0.49 కోట్లు

వెస్ట్: 0.32  కోట్లు

నెల్లూరు: 0.15 కోట్లు

ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 5.97 కోట్లు 

click me!