చంద్రబాబుపై విమర్శలు.. మంచు మనోజ్ లెటర్!

By Udaya DFirst Published Mar 26, 2019, 2:12 PM IST
Highlights

శ్రీవిద్యానికేతన్ విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించలేదని విద్యాసంస్థల చైర్మన్ మోహన్ బాబు ఇటీవల స్టూడెంట్స్ తో కలిసి ధర్నా చేసిన సంగతి తెలిసిందే. 

శ్రీవిద్యానికేతన్ విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించలేదని విద్యాసంస్థల చైర్మన్ మోహన్ బాబు ఇటీవల స్టూడెంట్స్ తో కలిసి ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోహన్ బాబు, ఆయన ఇద్దరు కొడుకులు చంద్రబాబుపై విమర్శలు చేశారు.

కావాలనే మోహన్ బాబు టీడీపీ పార్టీని టార్గెట్ చేస్తున్నారని, శ్రీ విద్యానికేతన్ కి ప్రభుత్వం చాలానే చెల్లించిందని, బకాయిలు ఇవ్వాల్సింది కొంతేనని అన్నారు. ఎన్నికల సమయంలో మోహన్ బాబు కావాలనే చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారనే మాటలు వినిపించాయి. టీడీపీ నేత కుటుంబరావు కూడా మోహన్ బాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

ఈ క్రమంలో మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఓ లెటర్ పోస్ట్ చేశాడు. అందులో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం గవర్నమెంట్ కి తాము రాసిన లెటర్స్ ని, ప్రభుత్వం ఎంత చెల్లించాల్సివుందో మొత్తం లెక్కలతో సహా పోస్ట్ చేశాడు. దీనికినెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.

మంచు ఫ్యామిలీ వైసీపీకి సపోర్ట్ అంటూ విమర్శలు గుప్పించారు. రాజకీయాల లబ్ది కోసమే ఇలా చేస్తున్నారని మంచు ఫ్యామిలీపై కామెంట్స్ చేశారు. వీటిపై తాజాగా స్పందించిన మంచు మనోజ్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. రాజకీయ ప్రయోజనాల కోసం తాను రోడ్డెక్కలేదని స్పష్టం చేశాడు. మంచిని పంచడానికి మతం, కులం అడ్డుపెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. 

Rajakeeya prayojanala kosam road ekkaledu..
Manchini panchadaniki mathamo, kulamo addu pettukonakkarledu..
Idi Nenu..Idi Nijam..
Na Peru Manoj Manchu, Na manasulo unnadi meeku cheppukuntunnanu🙏 pic.twitter.com/pUMVA4ktGm

— MM*🙏🏻❤️ (@HeroManoj1)
click me!