పవన్ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ గా మారనున్నాడా..?

Published : Feb 07, 2019, 04:15 PM IST
పవన్ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ గా మారనున్నాడా..?

సారాంశం

పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్'లోని టైటిల్ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ టైటిల్ సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా పని చేశాడు గణేష్ మాస్టర్. 

పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్'లోని టైటిల్ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ టైటిల్ సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా పని చేశాడు గణేష్ మాస్టర్. ఈ పాట అతడికి అవార్డులు తీసుకొచ్చింది. 

కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గణేష్ ఇప్పుడు డైరెక్టర్ గా మారడానికి రెడీ అవుతున్నాడు. కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారడం కొత్తేమీ కాదు. గతంలో ప్రభుదేవా, రాఘవ లారెన్స్, అమ్మ రాజశేఖర్ వంటి కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారి సినిమాలు తీసిన సంగతి తెలిసిందే.ఇప్పటికీ ప్రభుదేవా, లారెన్స్ సినిమాలు తీస్తూనే ఉన్నారు.

ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరడానికి రెడీ అవుతున్నాడు గణేష్ మాస్టర్. నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకే  కాకుండా రామ్, నితిన్ వంటి కుర్ర హీరోల సినిమాలకు కూడా పని చేశారు గణేష్ మాస్టర్. ఇప్పటికే ఆయన ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. 

తెలుగు హీరోలతో తనకున్న పరిచయాలతో ఇద్దరు ముగ్గురు హీరోలను కలిసి కథ కూడా వినిపించాడు. ప్రస్తుతం నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయి. మరికొద్దిరోజుల్లో దర్శకుడిగా సినిమా అనౌన్స్ చేయడం ఖాయమని తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు