చిరుకి ఇష్టం లేకపోయినా.. చరణ్ మాత్రం!

Published : Nov 16, 2018, 01:38 PM IST
చిరుకి ఇష్టం లేకపోయినా.. చరణ్ మాత్రం!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి చాలా కథలు విన్న తరువాత ఫైనల్ గా 'ఖైదీ నెంబర్ 150' సినిమా చేసి రీఎంట్రీలో తన సత్తా చాటాడు. ప్రస్తుతం చిరు 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను చరణ్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి చాలా కథలు విన్న తరువాత ఫైనల్ గా 'ఖైదీ నెంబర్ 150' సినిమా చేసి రీఎంట్రీలో తన సత్తా చాటాడు. ప్రస్తుతం చిరు 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాను చరణ్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా.. రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో పని చేయాలని కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో పలువురు దర్శకులతో చిరుకి కథలను వినిపిస్తున్నాడు. 

బోయపాటి, కొరటాల శివ వంటి దర్శకులు ఇప్పటికే చిరంజీవికి కథలు వినిపించారు. అయితే చరణ్ ఇలా తొందర పడుతుండడం చిరంజీవికి నచ్చడంలేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని చరణ్ తో చర్చించి ఒక సినిమా పూర్తైన తరువాతే తదుపరి సినిమాల గురించి ఆలోచిద్దామని చెప్పాడట.

పలు డిస్కషన్స్, స్టోరీలు అంటూ ఇప్పుడు తొందర పడి ఒత్తిడికి లోనవడం సరికాదని చిరు భావిస్తున్నాడు. ఇక నుండి కమిట్ అయిన సినిమా పూర్తయిన తరువాతే తదుపరి సినిమా గురించి ఆలోచించాలని నిర్ణయించుకున్నారు. నిజానికి కొరటాలతో రామ్ చరణ్ ఓ సినిమా చేయాల్సివుంది కానీ అది క్యాన్సిల్ అయింది. 
 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: సౌందర్య సినిమా చూసి చేతులు కాల్చుకున్న చిరంజీవి, ఇదెక్కడి గొడవరా అని తలపట్టుకున్న డైరెక్టర్
హృతిక్ రోషన్ 'క్రిష్' సినిమాలో ధోని భార్య నటించిందా?