అదే 'అపరిచితుడు' కహాని ('అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని' రివ్యూ)

By Prashanth M  |  First Published Nov 16, 2018, 1:30 PM IST

అనగనగా ఓ కథాఖడ్గం. దానిపేరు రివేంజ్. దానితో ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు తమ సిని సామ్రాజ్యాలను కాపాడుకున్నారు. కోట్లు వెనకేసుకున్నారు. మరికొందరు ఆ కత్తికే బలి అయ్యి...నామ రూపాలు లేకుండానూ పోయారు. సాధారణంగా రివేంజ్ స్టోరీ...ఒకే ఫార్మట్ చుట్టూ తిరుగుతుంది. 


సూర్య ప్రకాష్ జోశ్యుల

అనగనగా ఓ కథాఖడ్గం. దానిపేరు రివేంజ్. దానితో ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు తమ సిని సామ్రాజ్యాలను కాపాడుకున్నారు. కోట్లు వెనకేసుకున్నారు. మరికొందరు ఆ కత్తికే బలి అయ్యి...నామ రూపాలు లేకుండానూ పోయారు. సాధారణంగా రివేంజ్ స్టోరీ...ఒకే ఫార్మట్ చుట్టూ తిరుగుతుంది. 

Latest Videos

undefined

తన కళ్ల ఎదురుగా కన్న తల్లి తండ్రులను చంపేయటమో లేదా అన్యాయమో చేస్తే  వారి వారసుడు...ఆ పగతోనే పెద్దై..ఆ పగను ఎలా తీర్చుకున్నాడు అనేది ఈ రివేంజ్ కథ. ఈ కథాఖడ్గం తనకు బాగా ట్రీట్మెంట్ ఇచ్చి బాగా చూసుకున్న  వాళ్లకు బాగా కలిసి వచ్చింది. లేనివాళ్లను నిర్దాక్ష్యంగా ఖతం చేసేసింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ కత్తి మరీ ఓల్డ్ అయి పోయింది...తుప్పు పట్టేసిందిని...ఎంత కొత్తగా కొబ్బరినూనె రాసి వాడినా ..పాత వాసనలు పలకరిస్తున్నాయని వదిలేసారు.

అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నమ్మేవారు మాత్రం దీన్ని ఈ కథా ఖడ్గాన్ని తీసి అప్పుడప్పుడూ తిప్పుతున్నారు. వరసగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న దర్శకుడు శ్రీను వైట్ల తాజాగా ఈ ఖడ్గాన్ని తీసారు. తనదైన కామెడీ ట్రీట్మెంట్ ఇచ్చి  హిట్ కొడదామనుకున్నారు. ఆయన ఆశ నెరవేరిందా...రివ్యూ లో చూద్దాం.

కథేంటి  

‘Dissociative identity disorder’(మల్టిపర్శనాలిటి డిజార్డర్ లాంటిదే) చుట్టూ ఈ కథ అల్లబడింది.  

2003లో  అమర్ (రవితేజ), ఐశ్వర్య(ఇలియానా) పేరెంట్స్  న్యూయార్క్ లో ఫార్మా బిజినెస్ లో ఉంటారు. వాళ్లు మంచి స్నేహితులు ..బిజినెస్ పార్టనర్స్. పెద్దయ్యాక తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసి వియ్యంకులు కూడా అవుదామనుకుంటారు. అన్ని అనుకున్నట్లు జరిగితే అది సినిమా కథ ఎందుకు అవుతుంది. 

ఊహించని విధంగా ఓ రోజు తమ కంపెనీలో పనిచేసే  ఉద్యోగస్దులు (రాజ్‌వీర్‌, విక్ర‌మ్ త‌ల్వార్‌, సాబు మీన‌న్‌, క‌ర‌ణ్ ఆరోరా) చేత హత్య కావింపబడతాయి. నమ్మక ద్రోహంతో ..ప్లాన్ గా మర్డర్ చేసిన వాళ్లు  ఆ కంపెనీ హస్తగతం చేసుకుంటారు. ఆ సమయంలో   అక్కడ నుంచి అమర్, ఐశ్వర్య తప్పించుకుని పారిపోతారు. 

ఆ తర్వాత వాళ్లిద్దరూ వేర్వేరుగా పెరిగి పెద్దై ..తమ కుటుంబాలను తమ నుంచి దూరం చేసిన వారిపై పగ తీర్చుకునే రివేంజ్ పోగ్రాంలో   ఉంటారు. అయితే  ఇక్కడో ట్విస్ట్. వీళ్లద్దరి  డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ సమస్య ఉంటుంది. దాంతో వాళ్లు ఆ మానసిక సమస్యను ఎలా అధిగమిస్తూ పగ తీర్చుకోవాల్సిన సిట్యువేషన్.

అదే సమయంలో ఆ విలన్స్ కు తమను చంపటానికి హీరో బయిలుదేరారనే విషయం తెలుస్తోంది. ఆ విషయం తెలిసాక వాళ్లు  ఊరు కోరు కదా. తమ సేప్టీ కోసం    పోలీస్ అధికారి (అభిమ‌న్యు సింగ్‌) సాయం తీసుకుంటారు.అక్కడ నుంచి అభిమన్యు సింగ్ రంగంలోకి దిగి.. ...రవితేజను వెతికే ప‌నిలో ఉంటాడు. 

ఆ క్రమంలో రవితేజ తమ మానసిక సమస్య నుంచే కాక పోలీస్ ల  నుంచి తప్పించుకుని తన పగ ఎలా తీర్చుకున్నాడు..చిననాటి స్నేహితురాలు ఐషుని ఎలా కలుసుకున్నారు,కథలో జలాల్‌ అక్బర్‌(షాయాజీ షిండే)పాత్ర ఏమిటి..వంటి విషయాలు  అనేది మిగతా కథ.

ఎలా ఉంది..  

ఒక్కమాటలో చెప్పాలంటే కళ్యాణ్ రామ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన అతనొక్కడే సినిమాకు ఇంకో వెర్షన్ లా ఉంది. ఆ విషయం బయిటపడకుండా అపరిచితుడు అనే మాస్క్ తొడిగి తెరపైకి వదలినట్లుంది. సర్లేండి అతనొక్కడే వచ్చి చాలా కాలం అయ్యింది కదా ..జనాలకి గుర్తు ఉండదు కదా..అంటే ఆ కథను యాజటీజ్ అలాగే ప్రెజెంట్ చేసినా సమస్య లేకపోను.కేవలం కాపీ కొట్టారంటారంతే. ఈ కథ ..కావాలని కన్ఫూజన్ తో నడిపినట్లు ఉంటుంది.   

అపరిచితుడు కథకు ఓ సామాజిక సమస్య ముడిపెట్టారు..అప్పటికి అలాంటి పాయింట్ మొదటి సారి తెరపై చూడటం కాబట్టి చాలా బాగుందనిపిస్తుంది. అదే ఇక్కడ ...తన పర్శనల్ పగ కు మల్టిపర్శనల్ డిజార్డర్ అనే ఎలిమెంట్ కలపటం పెద్దగా ఆసక్తిగా అనిపించదు. అయినా ఎదుటివారి మానసిక రోగం ...మనకు కామెడీ ఎందుకు అవుతుంది.

స్క్రీన్ ప్లేనే సమస్య

ఈ సినిమాకు ప్రధాన సమస్య...విలన్స్ ముగ్గురు ఉన్నా..వాళ్లు కేవలం దిష్టిబొమ్మలు టైపే. పెద్దగా వారి వైపు నుంచి హీరోకు వచ్చే హర్డిల్స్ ఏమీ ఉండవు. పోనీ పోలీస్ అధికారి అభిమన్యు సింగ్ పాత్ర బిల్డప్ ఎక్కువ..బిజినెస్ తక్కువ అన్నట్లు సాగుతుంది. రివేంజ్ సబ్జెక్టు తీసుకున్నప్పుడు ...విలిజనం కూడా సరిగ్గా ఎలివేట్ కావాలి కదా. అది వదిలేసారు. దాంతో చాలా సీన్స్ బోర్ వచ్చేసాయి.

కామెడీ పండిందా

వాస్తవానికి శ్రీనువైట్ల సినిమా అంటే కామెడీ సినిమా వస్తోంది  అని ఎదురుచూసే ప్రేక్షకులు ఎక్కువ. అది ఆయనకు ప్లస్సో మైనస్సో కానీ..ఓ రకంగా ఇబ్బంది పెట్టే ఎలిమెంటే. అయితే ఈ విషయం అర్దం చేసుకున్న ఆయన ఈ సినిమా పూర్తి కామెడీతో రన్ అవుతుందంటూ కమిడయన్స్ తో  ప్రెస్ మీట్స్ పెట్టి పబ్లిసిటీ చేసారు. అయితే సినిమాలో కామెడీ ట్రై చేసారు కానీ ఆ మ్యాజిక్ జరగలేదు.

అమెరికాలో ఉన్న తెలుగు అశోశియేషన్స్ ని దృష్టిలో పెట్టుకుని చేసిన వాటా కామెడీ కాన్సెప్టు అసలు పేలలేదు. చాలా మందికి అర్దం కాలేదు కూడా. నమో వెంకటేశ సినిమాలో సీన్స్ ని గుర్తు చేసాయి. ఎన్నారైలకు ఏమన్నా ఆ సీన్స్ నచ్చి నవ్వు తెప్పిస్తాయేమో చూడాలి.  

కేఎ పాల్ కు ప్యారెడీగా సత్య చేత చేయించిన కామెడీ చాలా ఇరిటేటింగ్ గా ఉంది.ఇక  సునీల్ ఈ సినిమాలో కామెడీ ఇరగతీస్తాడు అనుకుంటే ఆయన సీన్స్ పెద్దగా లేవు.  అయితే కామెడీ బిట్స్ గా టీవి ఛానెల్స్ కు పనికొచ్చేలా ఉంది తప్పించి సినిమాకు అసలు ఉపయోగపడేలా లేవు.

గ్లామర్..ఎనర్జీ రెండూ మాయం

ఇలియానా దాదాపు ఆరేళ్ల తర్వత తెలుగు తెరపై కనపడింది. కాస్తంత ఒళ్లు చేసింది. హీరోయిన్ గా మాత్రం అనిపించలేదు. ఆ గ్లామర్ మాయమైంది. ఇక రవితేజ మాత్రం మూడు పాత్రల్లోనూ వేరియేషన్ చూపించేందుకు ప్రయత్నించాడు.  అయితే కొన్ని చోట్ల రవితేజ డల్ అయ్యిపోయారు. ఆయన ఎనర్జీ ఏమైపోయిందా అనిపిస్తుంది.

టెక్నికల్ గా 

తమన్‌ అందించిన పాటలు రవితేజ గత చిత్రాల స్దాయిలో హిట్ కాలేదు. జస్ట్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ సినిమాలో హైలెట్ ఏదైనా ఉందీ అంటే అది కేవలం  సినిమాటోగ్రఫి. ప్రతీ ఫ్రేమ్‌  చాలా అందంగా, లావిష్‌గా చూపించారు. ఎడిటింగ్‌ సెకండాఫ్ కొంత ట్రిమ్ చేయచ్చేమో అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఫైనల్ థాట్

స్టైలిష్ గా సినిమా తీస్తున్నాం కదా అని మన ఒరిజనల్ శైలి వదిలేసుకుంటే ప్రేక్షకులు మనల్ని వదిలేస్తారు. 

రేటింగ్: 2/5

 

   

click me!