క్లాసిక్ సంస్థకు చిరు ఖైదీ నంబర్ 150 ఓవర్సీస్ రైట్స్

Published : Dec 01, 2016, 01:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
క్లాసిక్ సంస్థకు చిరు ఖైదీ నంబర్ 150 ఓవర్సీస్ రైట్స్

సారాంశం

క్లాసిక్ ఎంటర్ టైన్ మెంట్స్ కు చిరు ఖైదీనంబర్ 150 ఓవర్సీస్ రైట్స్

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెం. 150’. చాలాకాలం తర్వాత చిరు రీ ఎంట్రీ ఇస్తోండడం, ఆయనకిది 150వ సినిమా కావడం లాంటి అంశాలతో ఖైదీ నెం. 150 మొదట్నుంచీ విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోంది.

 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి కాగా, చివరి పాట షూటింగ్ ఒక్కటి మిగిలి ఉంది. యూరోప్ లో ఇటీవలే రెండు పాటల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని మరోపాటను  ఈవారమే పూర్తి చేసేందుకు టీమ్ ఏర్పాట్లు చేసుకుంది.

 

డిసెంబర్ 2నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో చివరి పాట షూటింగ్ జరగనుంది. చిరంజీవి, కాజల్ అగర్వాల్‌లపై ఈ పాట ఉంటుందట. భారీ బడ్జెట్‌తో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా చిరు అభిమానులకు పండగ తెచ్చిపెడుతుందన్న ప్రచారం జరుగుతోంది.

 

జనవరి నెలలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా ‘కత్తి’కి రీమేకే ఈ ‘ఖైదీ నెం. 150’.

 

ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ ను... క్లాసిక్ ఎంటర్ టైన్ మెంట్స్ దక్కించుకుంది. దక్షిణాది చిత్రాల పంపిణీ దారులైన ఈ సంస్థ అధినేత సుధీర్ కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్ చరణ్ కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం
1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు