చిరు కోసం స్పెషల్ ట్రైనర్.. టార్గెట్ ఏంటంటే..?

Published : Jun 19, 2019, 02:24 PM IST
చిరు కోసం స్పెషల్ ట్రైనర్.. టార్గెట్ ఏంటంటే..?

సారాంశం

సినిమాల నుండి తప్పుకోవడంతో చిరంజీవి తన ఫిజిక్ మీద దృష్టి పెట్టడం మానేశారు. 

సినిమాల నుండి తప్పుకోవడంతో చిరంజీవి తన ఫిజిక్ మీద దృష్టి పెట్టడం మానేశారు. 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చిన సమయంలో కాస్త బొద్దుగానే కనిపించారు. సినిమా కోసం తగ్గడానికి ప్రయత్నించినా.. వర్కవుట్ అవ్వలేదు.

ప్రస్తుతం ఆయన నటిస్తోన్న 'సై రా' సినిమాలో కూడా చిరంజీవి లావుగానే కనిపిస్తున్నారు. కమర్షియల్ సినిమాల మాదిరి ఈ సినిమాల్లో డాన్స్ లు, ఫైటింగులు ఉండవు కాబట్టి ఫ్యాన్స్ సర్దుకుపోవచ్చు కానీ తన తదుపరి సినిమా కోసం చిరంజీవి తన బరువు తగ్గించుకోబోతున్నారని సమాచారం.

'సై రా' పూర్తయిన వెంటనే చిరు.. కొరటాలతో సినిమా చేయబోతున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించనున్నారు. అభిమానులు కోరుకునే విధంగా ఈ సినిమాలో స్టెప్పులు, కమర్షియల్ అంశాలు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని సమాచారం. దీనికోసం చిరంజీవి బరువు తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొరటాల కూడా మొదటి నుండి చిరంజీవికి బరువు తగ్గాలని చెబుతూనే ఉన్నాడట.

'సై రా' షూటింగ్ పూర్తయిన తరువాత చిరంజీవి బరువు తగ్గడంపై దృష్టి పెడతారని సమాచారం. చిరు కనీసం 15 కిలోలైనా బరువు తగ్గాలని టార్గెట్ పెట్టారట కొరటాల. దీనికోసం ప్రత్యేకమైన డైట్, వ్యాయామాలు మొదలుపెడుతున్నారని, చిరు కోసం ఓ ట్రైనర్ ని చరణ్ నియమించారని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఓ పాత్రలో కాస్త బొద్దుగా కనిపించినా పర్వాలేదట, కానీ మరో లుక్ లో ఆయన కాస్త సన్నగా కనిపించాలనేది కొరటాల డిమాండ్. దీంతో త్వరలోనే చిరు తన బరువుని తగ్గించుకోబోతున్నారని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా
Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?