చిరు సూచన మేరకు క్లైమాక్స్ ఛేంజ్!

Published : Mar 04, 2019, 03:54 PM IST
చిరు సూచన మేరకు క్లైమాక్స్ ఛేంజ్!

సారాంశం

చిరంజీవి కెరీర్ లో ఎన్నో హిట్స్ ని , కొన్ని ప్లాఫ్ లను  చూసినవారు.ఆ  ప్లాఫ్ ఎందుకు వచ్చాయో విశ్లేషించి మరీ జాగ్రత్తపడుతూ కెరీర్ ని హిట్ బాటలో మలుచుకున్నవాడు. అందుకే ఆయన ఇచ్చే సలహాలు అమూల్యంగా ఉంటాయి. 

చిరంజీవి కెరీర్ లో ఎన్నో హిట్స్ ని , కొన్ని ప్లాఫ్ లను  చూసినవారు.ఆ  ప్లాఫ్ ఎందుకు వచ్చాయో విశ్లేషించి మరీ జాగ్రత్తపడుతూ కెరీర్ ని హిట్ బాటలో మలుచుకున్నవాడు. అందుకే ఆయన ఇచ్చే సలహాలు అమూల్యంగా ఉంటాయి. తన అనుభవంతో రామ్ చరణ్ సినిమాలు దగ్గరుండి పర్యవేక్షిస్తూంటారు. ముఖ్యంగా ఎడిటింగ్ సమయంలో ఆయన ఇచ్చే సలహాలు చాలా అమూల్యంగా ఉంటాయని చెప్తారు.

ఇప్పుడు ఆ అనుభవాన్ని మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ వినియోగించుకోనున్నారు. సాయి ధరమ్ తేజ గత కొంతకాలంగా హిట్ అనేది లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సినిమాలు వసరగా  చేసుకుంటూ పోతున్నాడు కానీ ఏదీ నిలబడటం లేదు. అందుకు కారణం అతను ఎంచుకున్న స్క్రిప్టులే అని తేలింది. అప్పటికి మెగా బ్రాండ్ తో ఆరు ప్లాప్ లు వచ్చినా నిలబడి మరో సినిమా చేస్తున్నారు.

అయితే ఇలా ఎంతకాలం ప్లాఫ్ ల భారం మోయగలడు. అందుకే ఈ సారి చేస్తున్న చిత్రలహరి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తైంది. అయితే రషెష్ ని చిరంజీవి చూసి క్లైమాక్స్ మార్చమని సూచించారట. కిషోర్ తిరుమల ఈ సినిమాకు రియలిస్టిక్ క్లైమాక్స్ ని ప్లాన్ చేసారట. 

ఓ కుర్రాడు రెండు బ్రేక్ అప్ లను ఎక్సపీరియన్స్ చేయటం కథ అని తెలుస్తోంది. దానికి ఓ నెగిటివ్ ముగింపు ఇచ్చారట. అది చూసిన చిరంజీవి...తమిళం వాళ్లకు ఆ క్లైమాక్స్ నచ్చుతుంది కానీ మన తెలుగు వాళ్లకు సుఖాంతాలే కావాలని క్లియర్ గా చెప్పి..క్లైమాక్స్ మార్చమని చెప్పారట. అందుకు ఉదాహరణలు కూడా చెప్పారట. దాంతో కన్వీన్స్ అయిన కిషోర్ తిరుమల ఇప్పుడు క్లైమాక్స్ మార్చే పనిలో ఉన్నారట. 

PREV
click me!

Recommended Stories

Srinivasa Mangapuram 5 Days Collections: శ్రీనివాస మంగాపురంకి షాకింగ్‌ కలెక్షన్లు.. మహేష్‌ అన్న కొడుక్కి ఇది ఊహించలేం
Newtons 3rd Law 4 Days Collections: సుమంత్‌ మూవీకి దారుణమైన కలెక్షన్లు.. కనీసం హీరో రెమ్యూనరేషన్‌ కూడా రాలేదా?