పరిశ్రమ శ్రేయస్సు కోసం చిరంజీవి మరో గొప్ప నిర్ణయం!

By team teluguFirst Published Apr 21, 2021, 9:10 AM IST
Highlights

అపోలో 247 సౌజన్యంతో సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులకు ఉచిత కరోనా వాక్సిన్ అందించనున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

టాలీవుడ్ కి ఎటువంటి ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుకు వస్తారు చిరంజీవి. ఇక ఎన్నడూ ఎరుగని సంక్షోభాన్ని కరోనా వైరస్ పరిచయం చేసింది. అన్ని పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమ కరోనా కారణంగా కుదేలయ్యింది. గత ఏడాది మార్చి నెలలో మొదలైన లాక్ డౌన్ నెలల తరబడి సాగింది. షూటింగ్స్ నిలిచిపోవడం, సినిమాల విడుదల ఆగిపోవడం జరిగింది. దీనితో పరిశ్రమపై ఆధారపడ్డ వేల మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి. 


ఇలాంటి క్లిష్ట పరిస్థితి నుండి చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) కార్మికులకు అండగా నిలబడింది. స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు సీసీసీకి విరాళాలు ఇవ్వడం జరిగింది. విరాళాల ద్వారా వచ్చిన ఫండ్ తో సినీ కార్మికులకు అవసరమైన నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే కొందరికి ఆర్ధిక సహాయం కూడా చేయడం జరిగింది. 


ఏడాది తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిత్ర పరిశ్రమపై కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతుంది. ఇప్పటికే పదుల సంఖ్యలో చిత్ర ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తెలంగాణా రాష్ట్రంలో థియేటర్స్ బంద్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల కోసం ఉచిత వాక్సినేషన్ డ్రైవ్ ని సీసీసీ ప్రారంభిస్తున్నట్లు చిరంజీవి తెలియజేశారు. 


అపోలో 247 సౌజన్యంతో సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులకు ఉచిత కరోనా వాక్సిన్ అందించనున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అలాగే అందరూ మాస్క్ లు ధరించాలని, భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. 
 

తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 247 సౌజన్యంతో చేపడుతున్నాం. Lets ensure safety of everyone. pic.twitter.com/NpIhuYWlLd

— Chiranjeevi Konidela (@KChiruTweets)
click me!