‘ఇండియన్ సినిమా గర్వించే క్షణమిది’.. రాజమౌళిపై చిరంజీవి ప్రశంసల వర్షం!

By Asianet News  |  First Published Feb 23, 2023, 1:41 PM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిపై మెగాస్టార్ చిరంజీవి తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు. ఈరోజు రామ్ చరణ్ ఫేమస్ అమెరికన్ టాక్ షోలో పాల్గొనడంతో ఆనందం వ్యక్తం  చేస్తూ ఆసక్తికరంగా స్పందించారు. 
 


దర్శకధీరుడు, స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’తో  ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాకు గుర్తింపు దక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి ‘బాహుబలి’తో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక రీసెంట్ గా వచ్చిన RRRతో వరల్డ్ వైడ్ రెస్పాన్స్ ను సొంతం చేస్తున్నారు. ఏకంగా హాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన వార్డులనూ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆస్కార్ బరిలోనూ నిలిచి ప్రపంచం మొత్తం తెలుగు సినిమావైపు చూసేలా చేశారు. 

ఇక రాజమౌళి క్రియేట్ చేసిన సెన్సేషన్ పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో ‘నాటు నాటు’ (Naatu Naatu) ఓరిజినల్ సాంగ్ కు గాను ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ (Golden Globe) అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ డైరెక్టర్ గానూ రాజమౌళి అవార్డు అందుకున్నారు. ఇక ‘నాటు నాటు’ సాంగ్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘ఆస్కార్2023’కి నామినేట్ కూడా అయ్యింది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ను సాధిస్తుందని తెలుగు ప్రజలు ఆకాంక్షిస్తోంది. 

Latest Videos

ఈ క్రమంలో అమెరికాలో మార్చి 12న నిర్వహించనున్న Oscars2023 అవార్డు వేడుకలకు హాజరయ్యేందుకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఇవ్వాళ ఫేమస్ అమెరికన్ టాక్ షోGood Morning America లో సందడి చేశారు. యాంకర్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగానూ బదులిచ్చారు. దీనిపై చిరంజీవి స్పందిస్తూ.. ‘రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొనడం ఇండియన్ సినిమా గర్వంచే క్షణం.. ఎస్ఎస్ రాజమౌళి మెదడులో మెదిలిన ఉద్వేగభరితమైన ఆలోచనా శక్తి  ఏంటో ప్రపంచం చూస్తోంది. ఇప్పటి వరకు.. ఇకపైన’ అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ గా మారుతోంది. 

 

A Proud Moment for Telugu / Indian Cinema ,features on the famed

Amazing how the power of One passionate idea born in the visionary ‘s brain, envelopes the world!

Onwards & Upwards !! 👏👏https://t.co/Ur25tvt9r9 pic.twitter.com/SrpisRfviK

— Chiranjeevi Konidela (@KChiruTweets)
click me!