
గత కొంత కాలంగా మంచి హిట్ లేదు కింగ్ నాగార్జునకు. బంగార్రాజు సినిమా బాగుంది అనిపించినా.. అంతకు ముందు వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాతో పోల్చుకుంటే అది పెద్ద హిట్ కాదు. ఇక ఆతరువాత వచ్చి ది ఘోస్ట్ లాంటిసినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి. ఈక్రమంలోనే సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తుననాడు నాగ్. ఇటు నాగార్జున పరిస్థితి అలానే ఉంది. అటునాగ్ ఇద్దరు వారసుల పరిస్థితి కూడా అంతగా బాగోలేదు. ఇక నాగార్జున విషయానికి వస్తే..
నాగార్జున తన 99వ సినిమాకి సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టేశారు. రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రసన్న కుమార్ బెజవాడ, ఈ సినిమాతో దర్శకుడిగా ఈసినిమాతో పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాళ్ ఠాకూర్ ను తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని నాగ్ చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈక్రమంలోనే నాగార్జున తన 100 సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈసినిమాను కూడా ఇప్పటి నుంచే లైన్లో పెడుతున్నారట కింగ్. అయితే ఈసినిమా విషయంలో రాంగ్ స్టెప్ వేయకుండా పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట. తన 100వ సినిమా దర్శకుడిని కూడా నాగ్ సెలక్ట్ చేసుకున్నారట. ఈ సినిమాకి దర్శకుడిగా మోహన్ రాజాను తీసుకున్నాడని అంటున్నారు. మోహన్ రాజాతో డిస్కర్షనస్ కూడా అయిపోయినట్టుతెలుస్తోంది.
ఇక మెహన్ రాజా రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవికి గాడ్ ఫాదర్ సినిమాతో సూపర్ హిట్ అందించారు. ఈసినిమాతో పాటు గతంలో ఆయన సినిమాల టేకింగ్ నచ్చిన నాగార్జున.. తన 100 సినిమా బాధ్యతలను మోహన్ రాజా చేతిల పెట్టినట్టు తెలుస్తోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియనున్నాయి. అఫీషియల్ గా కూడా త్వరలో ప్రకటిస్తారని అంటున్నారు.