`ఆచార్య` కోసం ఇండియాలోనే బిగ్గెస్ట్ టెంపుల్‌ టౌన్‌ సెట్‌‌.. వీడియో షేర్‌ చేసిన మెగాస్టార్‌

Published : Jan 06, 2021, 05:20 PM ISTUpdated : Jan 06, 2021, 05:35 PM IST
`ఆచార్య` కోసం ఇండియాలోనే బిగ్గెస్ట్ టెంపుల్‌ టౌన్‌ సెట్‌‌.. వీడియో షేర్‌ చేసిన మెగాస్టార్‌

సారాంశం

`ఆచార్య` సినిమా కోసం భారీ సెట్‌ వేస్తున్నట్టు, దాదాపు ఇరవై ఎకరాల్లో టెంపుల్‌ టౌన్‌ని నిర్మిస్తున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. తాజాగా దాన్ని నిజం చేసి చూపించారు మెగాస్టార్‌. ఆయనే అధికారికంగా ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. 

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో ఈ సినిమా లావిష్‌గా తెరకెక్కుతుంది. వాణిజ్య అంశాలకు, మంచి సందేశాన్ని, సామాజిక అంశాలను జోడించి కొరటాల శివ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో చిరు సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ఈ సినిమా కోసం భారీ సెట్‌ వేస్తున్నట్టు, దాదాపు ఇరవై ఎకరాల్లో టెంపుల్‌ టౌన్‌ని నిర్మిస్తున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. తాజాగా దాన్ని నిజం చేసి చూపించారు మెగాస్టార్‌. ఆయనే అధికారికంగా ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. అంతేకాదు ఇండియాలోనే అతిపెద్ద సెట్‌ ఇదని వెల్లడించారు. ఈ మేరకు ఈ టెంపుల్‌ని వీడియో తీసి సోషల్‌  మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 

ఈ సందర్భంగా చిరు వీడియోలో స్పందిస్తూ, ``ఆచార్య` సినిమా కోసం ఇండియాలోనే అతిపెద్ద టెంపుల్‌ టౌన్‌ సెట్‌ ఇది. ఇరవై ఎకరాల విస్తీర్ణంలో వేయడం జరిగింది. అందులో భాగంగా గాలిగోపురం..ఆశ్చర్యం గొలిపేలా ప్రతి చిన్న చిన్న డిటెయిల్స్ ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది కళాదర్శకుల ప్రతిభకే ఓ మచ్చుతునక. నాకెంతో ముచ్చటనిపించి, నా కెమెరాలో బంధించి మీతో పంచుకుంటున్నా. నిజంగానే టెంపుల్‌ టౌన్‌లో ఉన్నామా? అనేంతగా రూపొందించిన కళా దర్శకుడు సురేష్‌ని, దీన్ని విజువలైజ్‌ చేసిన దర్శకుడు కొరటాల శివని, దీన్ని ఇంత అపురూపంగా నిర్మించేందుకు సహకరించి, కావాలసిన వనరులను అందించిన నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌లను అభినందిస్తున్నాను. ఇది ఆడియెన్స్ కి ఆనందానుభూతులను ఇస్తుందని నమ్ముతున్నా` అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు