మొహమాటం లేకుండా కట్ చేసేస్తున్న మెగాస్టార్ చిరు

By tirumala ANFirst Published Jul 26, 2019, 5:56 PM IST
Highlights

మెగాస్టార్‌ చిరంజీవి కు సినిమా పరిశ్రమలో ఉన్న అనుభవం సామాన్యమైనది కాదు. కాన్సెప్టు విని సినిమా వర్కవుట్ అవుతుందో లేదో చెప్పేయగలరని చెప్తారు. అలాగే ఆయనకు ఇరవై నాలుగు క్రాఫ్ట్ ల పైనా అపారమైన నాలెడ్జ్ ఉంది. దాంతో తన సినిమాలకు సంభందించి ప్రతీ విషయం దగ్గరుండి చూసుకుంటారు. డైరక్టర్ తో  పాటు ఆయనా ఎడిటింగ్ వంటి విషయాల్లో పాలు పంచుకుంటారని చెప్తారు. తనను తాను తెరపై కొత్తగా ఆవిష్కరించుకునే ప్రతీసారీ ఆయన జాగ్రత్లలు తీసుకుంటారు. 

మెగాస్టార్‌ చిరంజీవి కు సినిమా పరిశ్రమలో ఉన్న అనుభవం సామాన్యమైనది కాదు. కాన్సెప్టు విని సినిమా వర్కవుట్ అవుతుందో లేదో చెప్పేయగలరని చెప్తారు. అలాగే ఆయనకు ఇరవై నాలుగు క్రాఫ్ట్ ల పైనా అపారమైన నాలెడ్జ్ ఉంది. దాంతో తన సినిమాలకు సంభందించి ప్రతీ విషయం దగ్గరుండి చూసుకుంటారు. డైరక్టర్ తో  పాటు ఆయనా ఎడిటింగ్ వంటి విషయాల్లో పాలు పంచుకుంటారని చెప్తారు. తనను తాను తెరపై కొత్తగా ఆవిష్కరించుకునే ప్రతీసారీ ఆయన జాగ్రత్లలు తీసుకుంటారు. ఇప్పుడు ఆయన తన తాజా చిత్రం విషయంలో లెగ్త్ కట్ చేస్తున్నారని సమాచారం. 

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా లెగ్త్ బాగా ఎక్కువైందని ఆయన ఫీల్ అవుతున్నారట. డైరక్టర్ ..ఫరవాలేదని చెప్పినా ...కాదని ఆయన కొన్ని సీన్స్ కట్ చేస్తున్నారట. ఎక్కడా బోర్ కొట్టకుండా కంటెంట్ చెడకుండా సినిమా పరుగెత్తాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్శకుడు సురేంద్రరెడ్డి తో పాటు డైలీ  ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఉంటున్నారట. 
 
ఇక స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఉయ్యాలవాడ పాత్రలో చిరు ఒదిగిపోయారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో చిరుకు జోడీగా నయనతార నటిస్తున్నారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌..చిరుకు గురువుగా కీలక పాత్ర పోషించారు. విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలను హాలీవుడ్‌ నిపుణుల ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు. ‘స్కైఫాల్‌’, ‘హ్యారీపోటర్‌ అండ్‌ ది డెత్లీ హాలోస్‌’, ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌6’ తదితర చిత్రాలకు పనిచేసిన గ్రెగ్‌ పావెల్‌, ఆయన బృందం ఇందుకోసం పనిచేస్తోంది. సుమారు రూ.200కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్‌ తదితర భాషల్లో సినిమా విడుదల చేసేందుకు చిత్ర  యూనిట్ సన్నాహాలు చేస్తోంది. 

 

click me!