చిరంజీవి సర్జా ప్రధమ వర్థంతి... పూజలు నిర్వహించిన భార్య, కుటుంబ సభ్యులు!

Published : Jun 08, 2021, 01:21 PM ISTUpdated : Jun 08, 2021, 01:24 PM IST
చిరంజీవి సర్జా ప్రధమ వర్థంతి... పూజలు నిర్వహించిన భార్య, కుటుంబ సభ్యులు!

సారాంశం

యువ హీరో చిరంజీవి సర్జా అకాల మరణం అందరినీ కలచివేసింది. 35ఏళ్ల చిరంజీవి సర్జా 2020 జూన్ 7వ తేదీన గుండెపోటుతో మరణించారు.

2020 సంవత్సరం వివిధ కారణాలతో అనేక చిత్ర ప్రముఖులను పొట్టన బెట్టుకుంది. ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి లెజెండ్స్ లోకం వదిలి వెళ్ళిపోయారు. వీరి మరణాలు అభిమానులను తీవ్ర ఆవేదనలో ముంచివేశాయి. వీటితో పాటు యువ హీరో చిరంజీవి సర్జా అకాల మరణం అందరినీ కలచివేసింది. 35ఏళ్ల చిరంజీవి సర్జా 2020 జూన్ 7వ తేదీన గుండెపోటుతో మరణించారు.

కన్నడ పరిశ్రమలో హీరోగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న చిరంజీవి సర్జా ఆకస్మిక మరణం పరిశ్రమ ప్రముఖులను షాక్ కి గురిచేసింది. ఎంతో భవిష్యత్తు కలిగిన యువ నటుడు అలా అర్థాంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. చిరంజీవి సర్జా మరణించి సోమవారానికి సరిగ్గా ఏడాది ఏడాది కాలం గడిచింది.  


దీంతో కుటుంబ సభ్యులు కనకపుర రోడ్డులోని కగ్గిలిపుర నలగుళి వద్ద ధ్రువసర్జా ఫాంహౌస్‌లో సర్జా సమాధికి భార్య మేఘనారాజ్, చిన్నారి కొడుకు జూనియర్‌ చిరు, కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు. ప్రముఖ నటుడు, మేనమామ అర్జున్‌ సర్జా చిరుతో తీసుకున్న చిన్ననాటి ఫోటోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి సర్మించుకున్నారు. చిరంజీవి సర్జా యాక్షన్ హీరో అర్జున్ కి సొంత మేనల్లుడు అవుతారు. 


 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..