ఆయన అద్భుతమైన జ్ఞానం అనేక తరాలకు ఇన్‌స్పిరేషన్‌ః చిరంజీవి

By Aithagoni RajuFirst Published Oct 15, 2020, 5:30 PM IST
Highlights

దేశం గర్వించదగ్గ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతిని పురస్కరించుకుని ఆయన్ని గుర్తు చేసుకున్నారు చిరంజీవి. 

మన దేశానికి గొప్ప సేవలందించిన వారిలో మాజీ రాష్ట్రపతి, సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం ఒకరు. ఓ సైంటిస్ట్ గా, రాష్ట్రపతిగా ఆయన అశేషమైన సేవలందించారు. సైన్స్ పరంగా మన దేశాన్ని పురోగతి సాధించడంలో ఆయన కృషి చాలా పెద్దది.  దేశం గర్వించదగ్గ రాష్ట్రపతి కూడా.  ఆయన జయంతి నేడు(గురువారం). అక్టోబర్‌ 15, 1931లో జన్మించారు. ఆయన జయంతి సందర్భంగా అబ్దుల్‌ కలాంని గుర్తు చేసుకున్నారు చిరంజీవి. 

ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ, అబ్దుల్‌ కలాం.. దేశ గొప్ప రాష్ట్రపతుల్లో ఒకరు. మన గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో ఒకరు. గొప్ప మనవతావాదుల్లో ఒకరని, ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన ఆలోచనలు, అద్భుతమైన జ్ఞానం కొన్ని తరాలలో స్ఫూర్తిని నింపుతుందన్నారు. ఈసందర్భంగా కలాంతో దిగిన ఫోటోని చిరంజీవి పంచుకున్నారు. కలాం 2015 జులై 27న కన్నుమూసిన విషయం తెలిసిందే.

Remembering one of our great scientists,one of country's greatest Presidents, and one of the best human beings ever Bharat Ratna Dr.A.P.J.Abdul Kalam on his birth anniversary.Dr. 's thoughts and unmatched wisdom shall continue to Ignite minds for generations together. pic.twitter.com/366WUQsZOf

— Chiranjeevi Konidela (@KChiruTweets)

ప్రస్తుతం చిరంజీవి `ఆచార్య` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తుండగా, కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.  

click me!