మీరు పోరాట యోధులు.. మున్నాభాయ్‌ని ఉద్దేశించి చిరు భావోద్వేగ పోస్ట్

Published : Aug 12, 2020, 09:07 PM ISTUpdated : Aug 12, 2020, 09:47 PM IST
మీరు పోరాట యోధులు.. మున్నాభాయ్‌ని ఉద్దేశించి చిరు భావోద్వేగ పోస్ట్

సారాంశం

తన జీవితంలో ప్రారంభం నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనే తట్టుకుని నిలబడ్డ సంజయ్‌ దత్‌ని తాజాగా కాన్సర్‌ అంటుకుంది. మున్నాభాయ్‌కి కాన్సర్‌ సోకిందని తెలిసి బాలీవుడ్‌తోపాటు యావత్‌ దేశం ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. తన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. 

కాన్సర్‌ సెలబ్రిటీ జీవితాలతో ఆడుకుంటోంది. కాన్సర్‌తో ఎంతో మంది తారలు నెలకొరిగారు. ఏఎన్నార్‌ నుంచి ఇటీవల రిషికపూర్‌, ఇర్ఫాన్‌ఖాన్‌, అలాగే వినోద్‌ ఖన్నా, రాజేష్‌ ఖన్నా, ఫిరోజ్‌ ఖాన్‌ వరకు చాలా మంది తారలు కాన్సర్‌తో పోరాడి ఓడారు. సంజయ్‌ దత్‌ తల్లి నర్గీస్‌ కూడా కాన్సర్‌తో చనిపోయారు. మరోవైపు మనిషా కోయిరాలా, సోనాలి బ్రిందే, రాకేష్‌ రోషన్‌, యువరాజ్‌ సింగ్‌ వంటి వారు కాన్సర్‌ తో పోరాడి దాన్ని జయించారు.  

తాజాగా బాలీవుడ్‌ మున్నాభాయ్‌ సంజయ్‌ దత్‌ కాన్సర్‌ బారిన పడ్డారు. ఆయన లంగ్‌ కాన్సర్‌కి గురైనట్టు వైద్యులు నిర్థారించారు. దీంతో బాలీవుడ్‌తోపాటు యావత్‌ దేశం ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. తన జీవితంలో ప్రారంభం నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనే తట్టుకుని నిలబడ్డ సంజయ్‌ దత్‌ని తాజాగా కాన్సర్‌ అంటుకుంది. దీంతో బాలీవుడ్‌ ప్రముఖులు ఈ విషయం తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. తన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. 

ప్రియమైన సంజయ్ దత్‌ భాయ్‌.. మీరు కాన్సర్‌కి గురయ్యారనే వార్త తెలిసి చాలా బాధగా ఉంది. కానీ మీరొక పోరాట యోధులు. అనేక సంవత్సరాలు అనేక సంక్షోభాలను, స్ట్రగుల్స్ ని ఎదుర్కొన్నారు. వాటిని అధిగమించారు. ఇప్పుడు కూడా అనారోగ్య పరిస్థితి నుంచి ఎగిరే రంగుల వలే బయటపడతారని చెప్పడంలో సందేహం లేదు. మీరు త్వరగా కోలుకోవాలని ప్రేమతో ప్రార్థిస్తున్నా` అని ట్వీట్‌ చేశారు. 

మరోవైపు తన భర్తకి కాన్సర్‌ వచ్చిందని తెలిసి సంజయ్‌ దత్‌ భార్య మాన్యతా దత్‌ స్పందించారు. దేవుడు పరీక్షించేందుకు మళ్ళీ మమ్మల్నే ఎంచుకున్నారు. నా భర్త పోరాట యోధుడు, ఈ సారి కూడా విజయం  ఆయనదే` అని భావోద్వేగంగా స్పందించిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?