సంచలన దర్శకుడితో చిరంజీవి సినిమా.. పూనకాలు తెప్పించే వార్త వైరల్‌

By Aithagoni RajuFirst Published Jul 21, 2024, 5:07 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి బోల్డ్ గా ఆలోచిస్తున్నారు. ఆయన బోల్డ్ గా మూవీస్‌ చేయబోతున్నారట. అందులో ఓసంచలన దర్శకుడితో ఓ మాస్‌ ఫిల్మ్ సెట్‌ చేశాడని టాక్. 
 

మెగాస్టార్‌ చిరంజీవి మాస్‌ కి పెట్టింది పేరు. ఆయన మాస్‌ చిత్రాలతోనే స్టార్‌ గా ఎదిగాడు. 1980-2000 వరకు చేసిన సినిమాలన్నీ మాస్‌ చిత్రాలే. కమర్షియల్‌ హంగులన్నీ జోడించిన ఆ సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయాలను సాధించాయి. ఇటీవల `వాల్తేర్‌ వీరయ్య`లోనూ తన మాస్‌ ఏంటో చూపించాడు చిరు. ఆ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పుడు మరోసారి మాస్‌ మూవీ చేయబోతున్నారు. అయితే ఇది అలాంటి, ఇలాంటి మాస్‌ కాదు, ఓ ఊరమాస్‌ మూవీ. ఇంకా చెప్పాలంటే బోల్డ్ అండ్‌ మాస్‌, కమర్షియల్‌ మూవీ. కనీ వినీ ఎరుగని రీతిలో ఉండే మాస్‌ ఫిల్మ్ సెట్ చేస్తున్నాడట చిరు. 

ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. `బింబిసార` ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. `జగదేక వీరుడు అతిలోక సుందరి` తరహాలోనే భారీ బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ మూవీగా ఇది తెరకెక్కుతుంది. ఇందులో త్రిష హీరోయిన్‌. వీరితోపాటు మరో ఐదుగురు భామలు మెరవబోతున్నారు. వచ్చే సంక్రాంతికి దీన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం మ్యూజిక్‌ పై వర్క్ చేస్తున్నారు. 

Latest Videos

ఇదిలా ఉంటే చిరంజీవి నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది క్లారిటీ లేదు. చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా, ఇంకా ఫైనల్‌ కాలేదు. ఈ క్రమంలో ఓ సంచలన ప్రాజెక్ట్  సెట్‌ అయ్యిందనే రూమర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. `అర్జున్‌రెడ్డి`, `యానిమల్‌` వంటి బోల్డ్ సినిమాలను రూపొందించిన సందీప్‌ రెడ్డి వంగాతో సినిమా చేయబోతున్నారట చిరు. గతంలోనే ఈ ఇద్దరు ఓసారి కలిశారు. చిరు ఇంటికి వెళ్లిన సందీప్‌.. ఆ టైమ్‌లో ఓ లైన్‌ చెప్పారట. దానికి మెగాస్టార్‌ బాగా ఇంప్రెస్‌ అయ్యాడట. 

అయితే ఇప్పుడు కథకి సంబంధించిన క్లారిటీ వచ్చిందట. చిరంజీవికి అది నచ్చిందని, సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. అన్ని కుదిరితే చిరంజీవి బర్త్ డే రోజు ఆగస్ట్22న ఈ మూవీ ప్రకటన ఉంటుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ సంచలన ప్రాజెక్ట్ కి సంబంధించిన రూమర్లు ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. నిజంగానే సెట్‌ అయితే పూనకాలు ఖాయం. కానీ ఈ వార్తనే పూనకాలు తెప్పిస్తుంది. 

ఇదిలా ఉంటే సందీప్‌ రెడ్డి వంగా చేతిలో ఇప్పుడు రెండు సినిమాలున్నాయి. ప్రభాస్‌తో `స్పిరిట్‌` చేయాల్సి ఉంది. దీంతోపాటు అల్లు అర్జున్‌తో ఓ మూవీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగాస్టార్‌ సినిమా అంటూవార్తలు రావడం ఆశ్చర్యంగా మారింది. ఈ మూవీ ఎప్పుడు ఉంటుందనేది తెలియాల్సి ఉంది. ఆ రెండు సినిమాల తర్వాత ఇది ఉంటుందా? లేక ఇదే మొదట ప్రారంభవుతుంద? అనేది తెలియాల్సి ఉంది. 
 

click me!