
గెలుపు ఓటమి సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నాడు. క్రాక్ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చిన ఈ స్టార్ హీరో.. ఆతరువాత వరుస పరాజయాలు చూశాడు. ఇక ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు హడావిడిలో ఉన్నాడు రవితేజ ఈమూవీ నుంచి అప్‌డేట్స్ ఇస్తూ.. అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. ఇటీవలే విడుదల చేసిన టైగర్ నాగేశ్వరరావు టీజర్‌తో అందరి అటెన్షన్‌ను తనవైపునకు తిప్పుకున్నాడు.
1970స్ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ నేపథ్యంలో వస్తోన్న టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిని టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి కీలక పాత్రలు పోషిస్తున్న బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ఈసినమాతో పాటు రవితేజ్ ఈగల్ అనే టైటిల్ తో స్పై థ్రిల్లర్ ను తెరకెక్కించబోతున్నారు. తాజాగా రవితేజ విమానంలో ఎక్కడికో వెళ్లిపోతున్నాడు. ఎవరికీ చెప్పకుండా ఆయన ఒక్కరే ఎక్కడికివెళ్తున్నారు అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఆయన ప్లైట్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెట్టింట్లో అంది ట్రెండింగ్ అవుతోంది. దాంతో ప్యాన్స్ ఇలా క్వశ్ఛన్ చేస్తున్నారు. ఇంతకీ రవితేజ ఎక్కడికెళ్తున్నాడ ఈగల్ షూటింగ్ కు వెళ్తున్నాడు. ఇప్పటికే.. ఆయన టైగర్ నాగేశ్వరావ్ షూటింగ్ కంప్లీట్ చేశాడు..
ఇక ప్రస్తుతం రవితేజ ఫోకస్ అంతా స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈగల్‌పై పెట్టాడని తెలుస్తోంది. విమానంలోని బిజినెస్ క్లాస్‌లో దిగిన ఫొటోను ఇన్ స్ట్రాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. లండన్‌కు పయనం.. అంటూ ఈగల్ ఎమోజీని క్యాప్షన్‌గా పెట్టాడు. ఈగల్ నెక్ట్స్ షెడ్యూల్ లండన్‌లో జరుగనున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు. ఈ షెడ్యూల్‌తో రానున్న రెండు వారాలపాటు ఇంపార్టెన్ట్ సీన్స్ తో పాటు.. సాంగ్ షూట్ కూడా జరగబోతున్నట్టు తెలుస్తోంది.