Anjana Devi : ‘అమ్మ క్షమించు’ అంటూ భావోద్వేగానికి గురైన ‘చిరంజీవి’.. తల్లికి పవన్, నాగబాబు బర్త్ డే విషేస్..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 29, 2022, 11:51 AM IST
Anjana Devi : ‘అమ్మ క్షమించు’ అంటూ భావోద్వేగానికి గురైన ‘చిరంజీవి’..   తల్లికి పవన్, నాగబాబు బర్త్ డే విషేస్..

సారాంశం

కరోనా కారణంగా లక్షలాది మంది ప్రజల జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. ఎంతటి సిరిమంతులకైనా.. శోకం తప్పలేదు. అలాంటి పరిస్థితే మెగాస్టార్ చిరంజీవికి ఎదురైంది.  

మెగాస్టార్, పద్మబూషన్ అవార్డు గ్రహీత, డాక్టర్ కొనిదెల శివ శంకర్ వర ప్రసాద్ (చిరంజీవి) ప్రస్తుతం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 26న తను ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన వెంటనే స్వీయ నిర్బంధంలోకి  వెళ్లారు. అప్పటి నుంచి ఎలాంటి కార్యక్రామాలకూ హాజరు కావడం లేదు. కీర్తి సురేష్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి హాజరు కావాల్సిన ఉన్న కరోనా బారిన పడటంతో మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తేజ్ హాజరు కావాల్సి వచ్చింది.

 

ఈ రోజు చిరంజీవి తల్లి ‘కొనిదెల అంజన దేవి’ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిరంజీవి తన తల్లికి జన్మదిన శుభకాంక్షలు తెలిపాడు. అయితే కరోనాకు గురై స్వీయ నిర్బంధంలో ఉన్న చిరంజీవి ప్రత్యక్షంగా తన తల్లికి శుభాకాంక్షలు తెలియజేయనందుకు, ఆశీర్వాదం పొందనందుకు కొంత భావోద్వేగానికి గురయ్యాడు. ‘అమ్మా! జన్మదిన శుభాకాంక్షలు.. క్వారంటైన్ అయిన కారణంగా నీ  ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా.. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు.. మరు జన్నలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను.. అభినందనలతో .... శంకరబాబు’ అంటూ తన తల్లి మీద ప్రేమను చాటుకున్నాడు. 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం తన తల్ల ఆశీర్వాదం తీసుకుని, జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు తన ఇన్ స్టాలో ‘జన్మదిన శుభాకాంక్షలు అమ్మ.. అంజనదేవి గారు,  అన్నయ్య చిరంజీవిని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ పేర్కొన్నాడు. పవన్ కళ్యాణ్, తన తల్లి అంజనదేవి కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు.   

ఇక నాగబాబు మాత్రం తన తల్లితో కలిసి ఉన్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘పెదవే పలికిన మాటల్లోనే.. తియ్యని మాటే అమ్మ అంటూ’ వీడియోను పోస్ట్ చేశాడు.  ‘మమ్మల్ని నేడు ఈ స్థాయిలో నిలబెట్టిన, మా ఆనందాన్ని ఎల్లప్పుడూ కోరుకున్నారో అమ్మ.. నీకు జన్మదిన శుభాకాంక్షలు’ అని తన ప్రేమను తెలియజేశాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌