డోలు కొట్టేవాడి మీదెక్కిన చిరంజీవి హీరోయిన్ ఊర్వశి రాతెలా ... ఇలా కూడా హోలీ చేసుకుంటారా!

Published : Mar 08, 2023, 01:56 PM ISTUpdated : Mar 08, 2023, 02:07 PM IST
డోలు కొట్టేవాడి మీదెక్కిన చిరంజీవి హీరోయిన్ ఊర్వశి రాతెలా ... ఇలా కూడా హోలీ చేసుకుంటారా!

సారాంశం

దేశం మొత్తం ఘనంగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇక తారలు తమ వేడుకల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు. హీరోయిన్ ఊర్వశి రాతెలా ఆసక్తికర వీడియో పంచుకున్నారు.   

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రాతెలా హోలీ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. బంధు మిత్రులతో కలిసి రంగుల పండుగ జరుపుకుంటున్నారు. ఆడుతూ పాడుతూ, అల్లరి చేస్తూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. తన హోలీ వేడుకల ఫోటోలు, వీడియోలు ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. కాగా ఓ వీడియో నెటిజెన్స్ ని ఆకర్షించింది. అందుకు ఒక కారణం ఉంది. డోలు వాయిస్తున్న ఓ వ్యక్తిపై కూర్చొని ఊర్వశి డాన్స్ చేశారు. ఊర్వశి తీరు చూసిన నెటిజన్స్ ఇలా కూడా హోలీ జరుపుకుంటారా... అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే సుందరాంగి ఊర్వశిని మోసిన ఆ వ్యక్తిదే అదృష్టం అంటున్నారు. ఊర్వశి హోలీ వేడుకల వీడియోలు వైరల్ అవుతున్నాయి.  

ఇటీవల ఊర్వశి రాతెలా వాల్తేరు వీరయ్య మూవీతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. తన పరువాలను పరిచయం చేసింది. వాల్తేరు వీరయ్య చిత్రంలో 'బాస్ పార్టీ' అనే ఐటెం నంబర్ చేసిన ఈ బోల్డ్ బ్యూటీ టెంపరేచర్ పెంచేశారు. ప్రేక్షకులు సీట్లలో నుండి లేచి డాన్సులు చేశారు. చిరంజీవితో కలిసి ఎనర్జిటిక్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. ఇక ఊర్వశి తెలుగు జనాలకు తెగ నచ్చేశారు. 'బాస్ పార్టీ' సాంగ్ తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ సక్సెస్ తో సంక్రాంతి విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. 

కాగా గత ఏడాది ఊర్వశి  తమిళ మూవీ ది లెజెండ్ లో నటించారు. శరవణన్ అరుళ్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆశించినంతగా ఆడలేదు. అయితే ఊర్వశి మాత్రం కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. గుర్తింపు లేని హీరో కావడంతో పాటు ఆయన కోరి ఎంచుకోవడంతో బాగా డిమాండ్ చేసిందట. శరవణన్ ఈ చిత్రాన్ని సొంతగా నిర్మించి నటించారు.హీరో ఎవరైతేనేమీ నేను అడిగింది ఇచ్చేస్తే చాలన్న పద్ధతి శరవణన్ విషయంలో ఊర్వశి ఫాలో అయ్యింది.  నాలుగైదు సినిమాల సంపాదన ది లెజెండ్ మూవీతో రాబట్టింది. ది లెజెండ్ పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేశారు. వ్యాపారవేత్త హీరోగా మారడంతో సినిమాకు ప్రచారం దక్కింది. 

నెక్స్ట్ రామ్ పోతినేని మూవీలో ఊర్వశి రాతెలా కనిపించనుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ నటిస్తున్న చిత్రంలో ఊర్వశి ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మేరకు అధికారిక సమాచారం అందుతుంది. ఈసారి పూర్తి స్థాయిలో ఊర్వశి అందాలు తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేయనున్నారు. రామ్-బోయపాటి శ్రీను మూవీ సైతం పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఇది ఉండనుంది. అఖండ మూవీ తర్వాత బోయపాటి నుండి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ చిత్రం విజయం సాధిస్తే ఊర్వశి రాతెలా కెరీర్ కి ప్లస్ అవుతుంది. ఆమెకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ రావచ్చు.
 

PREV
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ