మెగాస్టార్ కు తప్పటం లేదు.. ఇండియా మొత్తం తిరగాల్సిందే!

Published : Sep 11, 2019, 01:29 PM ISTUpdated : Sep 11, 2019, 03:51 PM IST
మెగాస్టార్ కు తప్పటం లేదు.. ఇండియా మొత్తం తిరగాల్సిందే!

సారాంశం

చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం సైరా. ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో చిత్రం టీమ్ ప్రమోషన్స్ వేగం చేయాలని ప్లాన్ చేస్తోంది.

గతంలో బాలీవుడ్ మాత్రమే దేశం మొత్తం తిరిగి తన సినిమాలను ప్రమోట్ చేసుకునేది. ఇప్పుడు తెలుగు సినిమా కూడా అదే బాట పట్టింది. ప్రమోషన్స్  కోసం పెద్ద సినిమాలు వాళ్లు దేశం మొత్తం చుట్టముట్టాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అవుతోంది. ఆ మధ్యన విజయ్ దేవరకొండ ....డియర్ కామ్రేడ్ చిత్రం కోసం సౌత్ లో మెయిన్ సిటీలు కవర్ చేసే ప్రయత్నం చేసారు. ఆ తర్వాత రీసెంట్ గా సాహో సినిమా ప్రమోషన్ నిమిత్తం హీరో ప్రభాస్ ...దేశంలో అన్ని ప్రధాన పట్టణాలు చుట్టారు. అదే క్రమంలో ఇప్పుడు చిరంజీవి సైతం ప్రయాణం పెట్టుకోబోతున్నట్లు సమాచారం.

చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం సైరా. ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో చిత్రం టీమ్ ప్రమోషన్స్ వేగం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాక హిందీ, తమిళం,మళయాళ,కన్నడ భాషల్లో రిలీజ్ అవటంతో అక్కడ కూడా చిరు స్వయంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారట.

ఈ సినిమాకు నార్త్ ఇండియాలో మాగ్జిమమ్ ఎక్సపోజర్ రావాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు చిరంజీవి ..ముందుగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ప్రమోషన్ టూర్ చేయనున్నారు. ఆ మాత్రం చేయకపోతే మిగతా చోట్ల సినిమాకి గుర్తింపు రాదని రామ్ చరణ్ భావిస్తున్నారట. అందుకోసం బాలీవుడ్ నుంచి కొందరు మిత్రుల సహాయం తీసుకుని టూర్ ప్లాన్ చేస్తున్నారట.

PREV
click me!

Recommended Stories

Balakrishna: బాలకృష్ణకి నచ్చిన జూ. ఎన్టీఆర్ 2 సినిమాలు ఏంటో తెలుసా ? అభిమానులకు పూనకాలు తెప్పించిన మాట అదే
Chiranjeevi : దాసరి స్థానం మెగాస్టార్ దే, ఇండస్ట్రీ పెద్ద ఎవరో తేల్చేసిన మా మాజీ అధ్యక్షుడు