చిరంజీవికి జనసేనలోకి ఆహ్వానం.. బండ్ల గణేష్‌ ట్వీట్‌ వైరల్‌..

Published : Mar 30, 2022, 03:23 PM IST
చిరంజీవికి జనసేనలోకి ఆహ్వానం.. బండ్ల గణేష్‌ ట్వీట్‌ వైరల్‌..

సారాంశం

పవన్‌ కళ్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీలోకి మెగాస్టార్‌ చిరంజీవిని ఆహ్వానిస్తున్నారు.దీనిపై నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ స్పందించారు. ఆయన చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 

బండ్ల గణేష్‌.. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. మైక్‌ దొరికితే, సందర్భం పవన్‌ అయితే నాన్‌స్టాప్‌గా ప్రశంసలు కురిపిస్తూ ఎంటర్‌టైన్‌ చేస్తుంటాడు బండ్ల గణేష్‌. పూనకం వచ్చినట్టుగా ఊగిపోతుంటాడు. పవన్‌ని ఆకాశానికి ఎత్తేస్తుంటారు. పవన్‌ని దేవర అంటూ దేవుడిగా స్మరించుకుంటాడు బండ్ల గణేష్‌. ఆయనతో మరోసారి సినిమా చేసేందుకు ఆసక్తిగా వెయిట్‌ చేస్తున్నారు బండ్ల గణేష్‌. 

పవన్‌కి రాజకీయంగానూ తన మద్దతు తెలియజేస్తుంటారు బండ్ల గణేష్‌. కానీ దానికి చాలాపరిమితులున్నాయి. హీరోగా, వ్యక్తిగా పవన్‌ని ఇష్టపడే బండ్ల గణేష్‌ రాజకీయంగా మాత్రం సపోర్ట్ చేయడం వరకే పరిమితమయ్యాడు. అయితే తాజాగా రాజకీయంగా ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతుంది. తాను జనసేనలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నాడనే సంకేతాలనివ్వడం విశేషం. అయితే బండ్ల గణేష్‌ ఇలా ట్వీట్‌ చేయడానికి చిరంజీవి కారణం కావడం విశేషం. 

తాడపర్తికి చెందిన ఓ నాయకుడు చిరంజీవిని జనసేనలోకి రావాలని ఆహ్వానించారు. `చిరంజీవిగారు జనసేనలోకి రావాలి. పార్టీని అధికారంలోకి తేవాలి. మెగాస్టార్‌ స్టామినా ఏంటో చూపించాలి. అంధకారంలో ఉన్న ఏపీ ప్రజలను ఆదుకోవాలి. రాముడులోని సౌమ్యం మీరు, లక్ష్మణుడిలోని తెగింపు తమ్ముడిది. ఇద్దరు కలిస్తే రామరాజ్యం అవుతుంది అంటూ బండ్ల గణేష్‌, చిరంజీవి పేర్లని ట్యాగ్‌ చేశాడు సదరు నెటిజన్. దీనిపై బండ్ల గణేష్‌ రియాక్ట్ అయ్యారు. `మరి నేను` అంటూ రిప్లై ఇచ్చారు. మరి నన్ను ఆహ్వానించడం లేదనే కోణంలో ఆయన పోస్ట్ పెట్టగా, ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరి నిజంగానే బండ్ల గణేష్‌ జనసేనలోకి వెళ్లిందుకు సిద్ధంగా ఉన్నాడా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 

ఇదిలా ఉంటే గతంలో బండ్ల గణేష్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఎన్నికల్లోనూ పోటీ చేయాలనుకున్నారు. కానీ టికెట్‌ రాలేదు. దీంతో నిరాశ చెందిన బండ్ల గణేష్‌ ఆ మధ్య రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పుడు `మరి నేను` అనే ట్వీట్‌తో మరోసారి ఆయన హాట్‌ టాపిక్‌గా మారారు. మరి ఆయనకు జనసేనలోకి చేరే ఆలోచన ఉందా? అనే  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నటుడిగా బిజీగా ఉన్నారు బండ్ల గణేష్‌. ఆ మధ్య మహేష్‌తో `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటించారు. ఇప్పుడు ఆయన మెయిన్‌ లీడ్‌గా `డేగల బాబ్జీ` చిత్రంలో నటిస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధమవుతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే