చిరంజీవి ప్రయాణిస్తోన్న విమానంలో టెక్నికల్ సమస్య.. ఎమర్జన్సీ ల్యాండింగ్!

Published : Aug 31, 2019, 09:52 AM IST
చిరంజీవి ప్రయాణిస్తోన్న విమానంలో టెక్నికల్ సమస్య.. ఎమర్జన్సీ ల్యాండింగ్!

సారాంశం

విమానం ముంబై నుంచి హైదరాబాద్ బయల్దేరిన అరగంటకే సాంకేతిక లోపం.. వెంటనే గుర్తించిన పైలట్. విమానాన్ని వెనక్కు తిప్పి ముంబై ఎయిర్‌పోర్టులోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.   

మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తోన్న విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్ అయింది. ముంబై నుండి హైదరాబాద్ వస్తోన్న విస్తారా ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ అప్రమత్తమయ్యారు.

టేకాఫ్ అయిన అరగంటకే మళ్లీ విమానాన్ని వెనక్కి తిప్పి ముంబై ఎయిర్ పోర్ట్ లో ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో ఫ్లైట్ లో మొత్తం 120 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో సాంకేతిక కారణంతోనే ఎమర్జన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది.

పైలెట్ వెంటనే సమస్యను గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రయాణికులంతా ఎయిర్ పోర్ట్ లో పడిగాపులు కాయగా.. తర్వాత మరో విమానం ఏర్పాటు చేసి వారిని హైదరాబాద్ పంపారు. అదే విమానంలో ప్రయాణిస్తోన్న ఓ ప్రయాణికుడు చిరంజీవి ఫోటోను సోషల్ మీడియాతో పాటు వాట్సాప్ లో షేర్ చేయడంతో విషయం బయటకి వచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Brahmanandam: పెళ్లిళ్లు చేసింది వాడే.. కానీ ఇప్పుడు ప్రేమగా పలకరింపు లేదు, బ్రహ్మానందం సోదరుడి ఆవేదన
Pawan - Allu Aravind: పవన్ కళ్యాణ్ కాలెత్తడం అల్లు అరవింద్ కి నచ్చలేదా ? తొలగించాలని అనుకున్నారు.. కానీ