`ఆచార్య` ఫస్ట్ సింగిల్‌ రిలీజ్‌.. కుర్రాడిలా స్టెప్పేసిన చిరంజీవి.. ఫ్యాన్స్ కి పూనకమే!

Published : Mar 31, 2021, 04:37 PM ISTUpdated : Mar 31, 2021, 04:39 PM IST
`ఆచార్య` ఫస్ట్ సింగిల్‌ రిలీజ్‌.. కుర్రాడిలా స్టెప్పేసిన చిరంజీవి.. ఫ్యాన్స్ కి పూనకమే!

సారాంశం

తాజాగా విడుదలైన `ఆచార్య` చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌లో ఆయన వేసిన డాన్స్ లు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అదే ఫ్యాన్స్ అయితే ఊగిపోవాల్సిందే. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రం రూపొందుతుంది. 

చిరంజీవి ఆరున్నర పదుల వయసులోనే అద్భుతమైన ఫిట్‌నెస్‌ని మెయింటేన్‌ చేస్తున్నారు. ఈ వయసులో కూడా కుర్రాళ్లతో పోటీ పడి మరీ డాన్స్ చేస్తున్నాడు.తాజాగా విడుదలైన `ఆచార్య` చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌లో ఆయన వేసిన డాన్స్ లు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అదే ఫ్యాన్స్ అయితే ఊగిపోవాల్సిందే. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రం రూపొందుతుంది. కాజల్‌ హీరోయిన్‌. కీలక పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. 

తాజాగా బుధవారం సాయంత్రం ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ `లేహా లేహా.. `అంటూ సాగే పాటని విడుదల చేశారు. రిలీజ్‌ అయిన పూర్తి పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన అర్థగంటలోనే మూడు లక్షలకుపైగా వ్యూస్‌ పొందింది. మరిన్ని వ్యూస్‌తో దూసుకుపోతుంది. అయితే ఆద్యంతం కలర్‌ఫుల్‌గా ఈ పాట చిత్రీకరణ ఉండటం విశేషం. ఇందులో టెంపుల్‌ టౌన్‌ ముందు పెద్ద పండుగ వాతావరణంలో ఈ పాటని చిత్రీకరించారు. ఇందులో సంగీత డాన్సర్‌గా స్టెప్పులేయగా, మధ్యలో చిరంజీవి, హీరోయిన్‌ కాజల్‌ యాడ్‌ అయ్యారు. కాజల్‌ చీరకట్టులో అలరించింది. 

దీంతోపాటు చిరంజీవి సైతం స్టెప్పులేస్తూ కనిపించారు. అయితే ఆయన వేసిన డాన్స్ మాత్రం ఫిదా చేస్తుంది. కుర్రాడి మాదిరిగా మారిపోయి డాన్స్ చేయడం అబ్బురపరుస్తుంది. ఆరున్నర పదుల వయసులో అద్భుతమైన ఫిజిక్‌ మెయింటేన్‌ చేస్తూ, అదే జోరు, అదే ఊపులో చిరు డాన్స్ వేశాడు. కుర్రాడిలా మారిపోయాడు. ఆయన యంగ్‌ ఏజ్‌ అబ్బాయిలా డాన్స్ చేయడం ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ పాటకి హైలైట్‌గా మారుతుంది. ఈ చిత్రంలోనూ ఆయన చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. ఈ పాటలో రామ్‌చరణ్‌ షూటింగ్‌ని వీక్షించడం కూడా చూపించారు. 

మొత్తంగా కలర్‌ఫుల్‌ సెట్‌, ఊపుతెచ్చేసాంగ్‌, అదిరిపోయే చిరు స్టెప్పులు ఫ్యాన్స్ కి పూనకం తెప్పిస్తాయని చెప్పొచ్చు. ఈ పాటని హరికా నారాయణ్‌, సాహితి చాగంటి ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి రాశారు. మణిశర్మ సంగీతం అందించారు. మణిశర్మ,చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన పాటలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఈ చిత్ర ఆల్బమ్‌ కూడా ఎట్రాక్ట్ చేస్తుందని అంటున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?
Top 10 Heroes: హవా చూపించిన మహేష్‌, పవన్‌.. ఇండియా టాప్‌ 10 హీరోలు వీరే.. నెం 1 ఎవరంటే?