
మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తాజా చిత్రం భోళా శంకర్ (Bhola Shankar).తమిళ చిత్రం వేదాళమ్ రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రానికి మెహర్‌రమేశ్ దర్శకత్వం వహించాడు. భోళాశంకర్ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది చిరు టీం. నిన్న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
మరో ప్రక్క ఇక ఈ చిత్రం టిక్కెట్ రేటు పెంచటానికి సన్నాహాలు మొదలైనట్లు సమాచారం. ఆంధ్రాలో 25/- రూపాయలు పెంచమని అప్లై చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాల్ ..ఏపీ గవర్నమెంట్ చేతిలో ఉంది. అయితే చిరంజీవి సినిమా కావటంతో ఫర్మిషన్ ఈ సాయింత్రానికి వస్తుందని భావిస్తున్నారు. జీఎస్టీతో కలిపి 70 కోట్లు షేర్ వస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. రేట్లు తక్కువ ఉండటంతో రికవరీ కష్టమని రేట్లు పెంచమని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.
ఇక భోళాశంకర్ రన్ టైం...సీబీఎఫ్‌సీ ప్రకారం 160 నిమిషాలు (2 గంటల 40 నిమిషాలు). తెలుగు వెర్షన్‌లో చిరంజీవి ఇమేజ్, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేశాడట మెహర్ రమేశ్.
ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్, పాటలు, టీజర్, ట్రైలర్ నెట్టింట మంచి వ్యూస్ రాబడుతున్నాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. భోళా శంకర్‌లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ చిరంజీవి చెల్లెలిగా కనిపించనుంది. మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ రవి శంకర్, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.