మెగాస్టార్ ‘భోళాశంకర్’ నుంచి అభిమానులకు ఉగాది సందర్భంగా క్రేజీ అప్డేట్ అందింది. చిత్రం రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ అపీషియల్ అనౌన్స్ మెంట్ అందించారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - మెహర్ రమేశ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘భోళాశంకర్’ (Bola Shankar). ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్స్ అందుతూ వచ్చాయి. తాజాగా ఉగాది పండుగ సందర్బంగా మేకర్స్ మెగా అభిమానులు క్రేజీ అప్డేట్ అందించారు. ఎప్పటి నుంచో చిత్రం విడుదలకు సంబంధించిన అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తర్వాత చిరు నటిస్తున్న చిత్రమిది. దీంతో సినిమాపై అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈక్రమంలో సినిమా విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఉగాది సందర్భంగా మెగా ఫ్యాన్స్ కోసం భోళాశంకర్ విడుదల తేదీని ఫైనల్ చేస్తూ అప్డేట్ అందించారు మేకర్స్. మెగా అప్డేట్ తో తెలుగు సంవత్సరం ప్రారంభం కానుందని, సినిమాను 2023 ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే అదే రోజున సూపర్ స్టార్ మహేశ్ బాబు SSMB28 కూడా విడుదల చేస్తామని నిర్మాత అప్డేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరు, మహేశ్ మధ్య గట్టి పోటీ ఉండబోతోందని అర్థం అవుతోంది.
చిత్ర విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మెగా స్టార్ చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్ ఉన్నారు. రాయల్ సోఫాలో తమన్నా, కీర్తి కూర్చొని ఉండగా.. వారి వెనకాల మెగా స్టార్ నిల్చుని, సన్ గ్లాసెస్ ధరించి అట్రాక్టివ్ లుక్ లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ మెగా అభిమానులు ఆకట్టుకుంటోంది.
మొత్తానికి ‘భోళా శంకర్’ విడుదల తేదీ ఫైనల్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫస్ట్ నుంచే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, అప్డేట్స్ అంచనాలను పెంచేస్తున్నారు. మరోవైపు మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, కీర్తి సురేష్ చెల్లి పాత్రలో నటించబోతుండటం మరింత ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రం తమిళ మూవీ ‘వేదాళం’కు రీమేక్‌గా తెలుగులో తెరకెక్కుతోంది. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్‌పై అనిల్ సుంకర ఈ మూవీని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.