చిరు రావటానికి రామ్ చరణ్ కు కొన్ని రూల్స్ పెట్టారట...!

Published : Mar 16, 2018, 01:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
చిరు రావటానికి రామ్ చరణ్ కు కొన్ని రూల్స్ పెట్టారట...!

సారాంశం

రంగస్థలంలో చేసిన హంగామా ఏమిటో చూపించడానికి సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు రెడీ అయిపోతున్నాడు ఈ ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. ఈ ఈవెంట్ కు అటెండవడానికి చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ కు కొన్ని రూల్స్ పెట్టారట

రంగస్థలంలో చేసిన హంగామా ఏమిటో చూపించడానికి సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు రెడీ అయిపోతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన పీరియాడికల్ మూవీ రంగస్థలం ఈ నెలాఖరును థియేటర్లకు రానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈనెల 18న వైజాగ్ ఆర్.కె.బీచ్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. 

ఈ ఈవెంట్ కు అటెండవడానికి చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ కు కొన్ని రూల్స్ పెట్టారట. ఈ సినిమా రషెస్.. అక్కడక్కడా కొన్ని సీన్లు అన్నట్టుగా కాకుండా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి తొలికాపీ సిద్దం చేయమని చిరు చెప్పారు. సినిమా మొత్తం చూశాకనే రంగస్థలం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వస్తానని ముందుగానే క్లియర్ కట్ గా చెప్పారట. రంగస్థలం మూవీపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ అంచనాలు మూవీ టీం ఎంతమేరకు చేరుకోగలిగిందో ఓ ఐడియాకు వచ్చాకే బహిరంగంగా సినిమా గురించి మాట్లాడటం కరెక్టని మెగాస్టార్ డిసైడయ్యారట. 

సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న రంగస్థలం మూవీలో ఐదు పాటలు బయటకొచ్చాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ పాటలన్నీ ఫ్యాన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి. ఈనెల 30న రంగస్థలం మూవీ ప్రేక్షకుల ముందుకొస్తోంది.

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?