అనిల్‌ రావిపూడితో మెగాస్టార్‌ సినిమా కన్ఫమ్‌.. ? లేటెస్ట్ అప్‌డేట్‌ ఇదే!

Published : Nov 26, 2023, 01:48 PM IST
అనిల్‌ రావిపూడితో మెగాస్టార్‌ సినిమా కన్ఫమ్‌.. ? లేటెస్ట్ అప్‌డేట్‌ ఇదే!

సారాంశం

చిరంజీవి హీరోగా సినిమా చేసేందుకు దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా కాలంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వార్తలొస్తున్నాయి. తాజాగా ఓ మంచి అప్డేట్‌ వచ్చింది.

దర్శకుడు అనిల్‌ రావిపూడి సినిమా సినిమాకి ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. స్టార్‌ డైరెక్టర్ల జాబితాలో చేరుతున్నారు. ఇటీవలే ఆయన బాలకృష్ణతో `భగవంత్‌ కేసరి` సినిమాని రూపొందించారు. ఇది మంచి ఆదరణ పొందింది. దసరా పండక్కి రావడం, అపోజిట్‌లో బలమైన సినిమాలు లేకపోవడంతో దాదాపు బయ్యర్లు సేఫ్‌ జోన్‌కి చేరుకున్నారు. మొత్తానికి ఈ మూవీ హిట్‌ ఖాతాలో పడింది. 

ఇక అనిల్‌ రావిపూడి నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారనే వార్తలొచ్చాయి. అయితే ఆ రూమర్లు నిజమే అని తెలుస్తుంది. అనిల్‌ రావిపూడి చెప్పిన కథకి చిరంజీవి ఓకే చెప్పారట. స్క్రిప్ట్ పరంగా దాదాపు ఓకే అయ్యిందని తెలుస్తుంది.  మిగిలిన బేరసారాలు జరుగుతున్నాయని, బడ్జెట్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీని దిల్‌రాజు నిర్మించబోతున్నారని సమాచారం.

చిరంజీవితో దిల్‌రాజుకు ఇదే మొదటి సినిమా. ఓ రకంగా డ్రీమ్‌ ప్రాజెక్ట్ కాబోతుందని చెప్పొచ్చు. అందుకోసం ఈ మూవీపై ప్రత్యేకమైన కేర్‌ తీసుకుంటున్నారట. ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌, వెంకటేష్‌లతో సినిమాలు చేశారు దిల్‌రాజు. ఇప్పుడు రామ్‌చరణ్‌తో శంకర్‌ మూవీ `గేమ్‌ ఛేంజర్‌` చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవితో సినిమా చేయబోతున్నారు. 

చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది ఇటీవలే ప్రారంభమైంది. సోషియో ఫాంటసీగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. మూడు లోకాల నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇందులో హీరోయిన్‌గా అనుష్క, ఐశ్వర్య రాయ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు