ఆయన జీవిత సత్యాలు స్ఫూర్తిదాయకంః అల్లు రామలింగయ్య జ్ఞాపకాల్లో మెగాస్టార్‌, ఐకాన్‌ స్టార్‌

Published : Jul 31, 2021, 06:11 PM IST
ఆయన జీవిత సత్యాలు స్ఫూర్తిదాయకంః అల్లు రామలింగయ్య జ్ఞాపకాల్లో మెగాస్టార్‌, ఐకాన్‌ స్టార్‌

సారాంశం

నేడు శనివారం(జులై 31) అల్లు రామలింగయ్య వర్థంతి. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తోపాటు పలువురు అల్లు రామలింగయ్యని తలుచుకుంటూ నివాళ్లర్పించారు. 

తెలుగు సినిమా తొలి తరం హాస్యనటుల్లో ఒకరు అల్లు రామలింగయ్య. కామెడీయన్‌గానే కాదు, విలన్‌ పాతలతోనూ మెప్పించిన ఘనత ఆయన సొంతం. చలాకీగా, చిలిపిగా యాక్ట్ చేస్తూ గిలిగింతలు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. చిత్ర పరిశ్రమకి ఆయన ఎనలేని సేవలందించారు. నేడు శనివారం(జులై 31) అల్లు రామలింగయ్య వర్థంతి. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తోపాటు పలువురు అల్లు రామలింగయ్యని తలుచుకుంటూ నివాళ్లర్పించారు. 

చిరంజీవి స్పందిస్తూ, `శ్రీ అల్లు రామలింగయ్య గారు భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన నేర్పిన జీవిత సత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయి. ఒక డాక్టర్ గా, యాక్టర్ గా, ఫిలాసఫర్ గా, ఓ అద్భుతమైన మనిషిగా, నాకు మావయ్యగా ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు మరోసారి నెమరువేసుకుంటూ ..` అంటూ గతంలో అల్లు రామలింగయ్య ఫోటోకి నివాళులర్పిస్తున్న ఫోటోలను ట్విటర్‌ ద్వారా షేర్‌ చేశాడు చిరు. 

మరోవైపు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సైతం నివాళ్లర్పించారు. `ఒక రైతు, లెజెండరీ నటుడు, గొప్ప వ్యక్తి అయిన తాత అల్లు రామలింగయ్య వర్థంతి నేడు. సినిమాలపై ఆయనకున్న అభిరుచి, ఆయన జీవిత ప్రయాణం మనలోని చాలా మంది స్ఫూర్తిదాయకం. ఆయన మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాడు` అని ట్వీట్‌ చేశారు అల్లు అర్జున్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే