అభిమానాన్ని చూపించే టైమ్‌ వచ్చింది.. మ్యూజిక్‌ సిట్టింగ్స్ తో `చిరు153` షురూ

Published : Jun 28, 2021, 07:06 PM IST
అభిమానాన్ని చూపించే టైమ్‌ వచ్చింది.. మ్యూజిక్‌ సిట్టింగ్స్ తో `చిరు153` షురూ

సారాంశం

చిరంజీవి నెక్ట్స్ మోహన్‌రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్‌ హిట్‌ `లూసిఫర్‌` రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తాజాగా మ్యూజిక్‌ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి.

మెగాస్టార్‌ కొత్త సినిమా పనులు ఊపందుకున్నాయి. చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య`లో నటిస్తున్నారు. అనంతరం మోహన్‌రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్‌ హిట్‌ `లూసిఫర్‌` రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తాజాగా మ్యూజిక్‌ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. దర్శకుడు మోహన్‌రాజా, సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. థమన్‌తో కలిసి ట్యూన్స్‌ కంపోజింగ్‌తో `చిరు 153` సినిమా పనులను స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు మోహన్‌రాజా, సంగీత దర్శకుడు ఎస్.ఎస్‌.థమన్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. 

`మెగాస్టార్‌ చిరంజీవిపై ఉన్న ప్రేమని చూపించే టైమ్‌ వచ్చింది. కచ్చితంగా ఇందులోని పాటలు అద్భుతంగా ఉండబోతున్నాయి` అని తమన్‌ తెలిపారు. ఈ సినిమాని ఎన్వీ ప్రసాద్‌, రామ్‌ చరణ్‌ కలిసి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఇది రెగ్యూలర్‌ షూటింగ్‌ని ప్రారంభించుకోనుంది. ప్రస్తుతం చిరంజీవి `ఆచార్య`లో నటిస్తున్నారు. కొరటాలశివ దర్శకుడు. కాజల్‌ కథానాయికగా నటిస్తుంది. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన సరసన పూజా హెగ్డే కనిపించనుంది. ఇది త్వరలోనే రిలీజ్‌కి రెడీ అవుతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

3 Roses 2 OTT Review: 3 రోజెస్‌ సీజన్‌ 2 రివ్యూ.. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత బోల్డ్ సిరీస్‌ ఎలా ఉందంటే?
అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..? బాలయ్య సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?