`ఒకే ఒక జీవితం` అంటోన్న శర్వానంద్‌.. ప్రపంచీకరణ ప్రభావాన్ని తెలిపేలా!

Published : Jun 28, 2021, 05:32 PM IST
`ఒకే ఒక జీవితం` అంటోన్న శర్వానంద్‌.. ప్రపంచీకరణ ప్రభావాన్ని తెలిపేలా!

సారాంశం

జీవితంలోని బ్యూటీని కనుక్కోవడానికి హీరో చేసే పోరాటం, స్ట్రగుల్స్, జర్నీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని పోస్టర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో శర్వానంద్‌ గిటార్ బ్యాగ్‌ని వెనకాల తగిలించుకుని ముందుకు సాగుతున్నట్టుగా తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ ఉంది.   

శర్వానంద్‌ కొత్త సినిమాని ప్రకటించాడు. `శర్వా30` చిత్రానికి `ఒకే ఒక జీవితం` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా టైటిల్‌ పోస్టర్‌ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి శ్రీ కార్తిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జీవితంలోని బ్యూటీని కనుక్కోవడానికి హీరో చేసే పోరాటం, స్ట్రగుల్స్, జర్నీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని పోస్టర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో శర్వానంద్‌ గిటార్ బ్యాగ్‌ని వెనకాల తగిలించుకుని ముందుకు సాగుతున్నట్టుగా తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ ఉంది. 

ఈ పోస్టర్‌లో ఒక వైపు పచ్చదనం, పోస్టాఫీసు, లేఖ, మ్యూజిక్ క్యాసెట్, గాలిపటాలు మొదలైనవి చూపించారు. మరొక వైపు కర్మాగారాలు, సెల్ టవర్, మొబైల్, మ్యూజిక్ సిస్టమ్, ఫ్లైట్ ని చూపించారు. ఈ పోస్టర్ ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించేలా ఉంది. అదే సమయంలో ఉత్తరాల కాలం నుంచి సెల్‌ఫోన్‌ వరకు, పల్లెటూరు నుంచి పట్నం వరకు ప్రపంచంలో, సమాజంలో వచ్చిన మార్పులకు ఇది అద్దం పడుతుంది. ఓ కంప్లీట్‌ జీవితాన్ని ఆవిష్కరించబోతున్నారనిపస్తుంది. జీవితం ఒక్కటే, దాన్ని ఆస్వాధించాలని ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నట్టు టైటిల్‌ తెలియజేస్తుంది. మొత్తంగా `శర్వా30` ఆద్యంతం ఆసక్తికరంగా ఉండబోతుందని అర్థమవుతుంది. 

ఇక ఈ చిత్రంలో అమల అక్కినేని కీలక పాత్ర పోషిస్తుండగా, రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్స్ పతాకంపై ఎస్‌. ఆర్‌ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు. జేక్స్ బీజోయ్ సంగీతం స‌మ‌కూరుస్తుండగా `డియ‌ర్ కామ్రెడ్` ఫేమ్ సినిమాటోగ్రాఫ‌ర్‌, ఎడిట‌ర్ సుజీత్ సారంగ్, శ్రీ జిత్ సారంగ్ ఈ చిత్రంలో భాగ‌మ‌య్యారు. `ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో శ‌ర్వానంద్‌కు మంచి  ఫాలోయింగ్ ఉంది.  సై - ఫై ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియ‌న్స్‌తో పాటు యూత్‌కి న‌చ్చే విధంగా ఉండ‌బోతుంది. నిజానికి త‌ల్లి-కొడుకుల బంధంతో ఉన్న సినిమాలు అన్ని వ‌ర్గాల వారికి న‌చ్చుతాయి.  ఇప్ప‌టికే ఒకే ఒక జీవితం మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని యూనిట్‌ తెలిపింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

3 Roses 2 OTT Review: 3 రోజెస్‌ సీజన్‌ 2 రివ్యూ.. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత బోల్డ్ సిరీస్‌ ఎలా ఉందంటే?
అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..? బాలయ్య సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?