‘జెర్సీ’ మూవీపై రామ్ గోపాల్ వర్మ అభిప్రాయం ఇదే.. ‘డెత్ ఆఫ్ రీమేక్స్’ అంటూ ఆర్జీవీ వరుస ట్వీట్లు..

Published : Apr 26, 2022, 05:39 PM ISTUpdated : Apr 26, 2022, 05:42 PM IST
‘జెర్సీ’ మూవీపై రామ్ గోపాల్ వర్మ అభిప్రాయం ఇదే.. ‘డెత్ ఆఫ్ రీమేక్స్’ అంటూ ఆర్జీవీ వరుస ట్వీట్లు..

సారాంశం

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ (Jersey) మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అలాగే రీమేక్ ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో వరుస ట్వీట్లతో తన అభిప్రాయాన్ని వ్యక్తం పరిచారు.

నేచురల్ స్టార్ నాని (Nani), యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషనల్ వచ్చిన చిత్రం  ‘జెర్సీ’. ఈ చిత్రం తెలుగులో 2019లో రిలీజ్ అయిన ఏకంగా జాతీయ స్థాయి అవార్డును అందుకుంది. అదేవిధంగా దర్శకుడు Gowtam Tinnanuri కూడా బెస్ట్ డైరెక్టర్ అవార్డను  పొందాడు. విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది తెలుగు వెర్షన్ జెర్సీ. అయితే ఇదే సినిమాను హిందీలో సేమ్ టైటిట్ లో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor)తో నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 22న రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందను పొందుతోంది. ఒకరకంగా చెప్పాలంటే హిందీ వెర్షన్ కు అంతగా ఆదరణ లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

ఈ సినిమా తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) స్పందించారు. వరుస ట్వీట్లతో రీమేక్ లపై తన  అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ‘హిందీలో జెర్సీ చిత్రం రీమేక్‌ల మరణాన్ని సూచిస్తుంది. రీమేక్ ల కన్నా డబ్బింగ్ చిత్రాలే రాణిస్తున్నాయని  ఇప్పటికే పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు నిరూపించాయి. అలాగే  నాని ఒరిజినల్ జెర్సీని తెలుగు నుండి డబ్ చేసి విడుదల చేస్తే నిర్మాతలకు కేవలం రూ.10 లక్షలు ఖర్చు అయ్యేది. కానీ హిందీలో రీమేక్ చేయడం మూలంగా రూ.100 కోట్లు ఖర్చు, సమయం, శ్రమ అన్ని వేస్ట్ అని భావించారు.  

పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 వంటి డబ్బింగ్ చిత్రాలకు నార్త్ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో మంచి కంటెంట్ ఉన్న ఏ దక్షిణాది సినిమా రీమేక్ హక్కులకు విక్రయించటం లేదు. ఈ పరిణామాలు రీమేక్స్ చిత్రాలను నశింపజేస్తున్నాయి. అదేవిధంగా బాలీవుడ్‌కి ఇప్పుడు సూపర్‌హిట్‌ చిత్రాలను ఎలా తీయాలో తెలియడం లేదు. లేదా దక్షిణాది చిత్రాలను రీమేక్ చేయడం వల్ల మనుగడ సాగించాలని వారు ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. అయినా ఇకపై రీమేక్ రీమేక్ హక్కులను ఎవరూ విక్రయించకపోవడం గమనార్హం’ అంటూ ట్వీట్ చేశాడు. 

చివరిగా ట్వీట్ చేస్తూ ‘కథ యొక్క నైతికత ఏమిటంటే, డబ్బింగ్ చిత్రాలను రీమేక్ చేయడానికి బదులు వాటిని నేరుగా విడుదల చేయడం తెలివైన పనిగా అభిప్రాయపడ్డారు.ఎందుకంటే ప్రేక్షకులకు ఆసక్తి ఉన్నంత వరకు ఏ  ప్రాంతం నుంచైనా, ఏ నటుడి ముఖానైనా, సబ్జెక్ట్‌ ఏదైనా సరే మంచి రెస్పాన్స్ నే అందుకుంటుందన్నారు’ ఇలా రీమేక్ లు వద్దంటూ ఇన్ డైరెక్ట్ గా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఆర్జీవీ.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?