Indian Idol Telugu: అమ్మాయిలని లైంగికంగా వేధించాడు.. అక్కడ కూర్చోబెడతారా, దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 25, 2022, 11:58 AM IST
Indian Idol Telugu: అమ్మాయిలని లైంగికంగా వేధించాడు.. అక్కడ కూర్చోబెడతారా, దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

సారాంశం

ఇండియన్ ఐడల్ తెలుగు సింగింగ్ రియాలిటీ షో నేడు ఆహా ఓటిటిలో ప్రారంభం కానుంది. ఈ రియాలిటీ షోపై అందరిలో ఆసక్తి ఉంది. అయితే ఓ అంశం విషయంలో ఈ షో వివాదంలో నిలిచింది.

ఇండియన్ ఐడల్ తెలుగు సింగింగ్ రియాలిటీ షో నేడు ఆహా ఓటిటిలో ప్రారంభం కానుంది. ఈ రియాలిటీ షోపై అందరిలో ఆసక్తి ఉంది. అయితే ఓ అంశం విషయంలో ఈ షో వివాదంలో నిలిచింది. ఈ షోకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, అందాల హీరోయిన్ నిత్యామీనన్, ప్రముఖ సింగర్ కార్తీక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. 

ఈ అయితే కార్తీక్ విషయంలోనే వివాదం చెలరేగింది. గతంలో కార్తీక్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపించాయి. దీనితో అలాంటి వ్యక్తిని తీసుకువచ్చి జడ్జిగా ఎలా కూర్చోబెడతారు అని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. 2018లో మీటూ ఉద్యమం ఒక రేంజ్ లో రచ్చ చేసింది. నటీమణులని, మహిళా సింగర్స్ ని లైంగికంగా వేధించిన చాలా మంది సెలెబ్రటీల పేర్లు వెలుగులోకి వచ్చాయి. 

వారిలో సింగర్ కార్తీక్ పేరు కూడా ఉంది. చాలా మంది మహిళా సింగర్స్ కార్తీక్ తమని లైంగికంగా వేధించినట్లు ఆరోపించారు. దీనితో కార్తీక్ అప్పట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని.. తన పై వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని కార్తీక్ కొట్టిపారేశారు. నేనెప్పుడూ అమ్మాయిలతో ఇబ్బందికరంగా ప్రవర్తించలేదని కార్తీక్ అప్పట్లో తెలిపాడు. 

కానీ కార్తీక్ తమని వేధించిన విషయం వాస్తవం అని కొందరు మహిళా సింగర్స్ వాపోయారు.కార్తీక్ ని ఇండియన్ ఐడల్ షోకి జడ్జిగా నియమించడం మహిళలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. నెటిజన్లు తీవ్రమైన విమర్శలు చేస్తూ దుమ్మెత్తి పోస్తున్నారు. 

సింగర్ చిన్మయి శ్రీపాద కూడా నెటిజన్లకు తోడైంది. కార్తీక్ అమ్మాయిలకు అసభ్యకరమైన మెసేజ్ లు, చిత్రాలు పంపేవాడని గతంలో చిన్మయి ఆరోపించింది. చిన్మయి మాట్లాడుతూ.. ఇది షాకింగ్ గా ఉంది. అతడిని మంచి వ్యక్తిగా మార్చి ఈ షోకి తీసుకువస్తున్నారా అని చిన్మయి ప్రశ్నించింది. 

ఈ షోలో పాల్గొంటున్న మహిళలకు కార్తీక్ పై ఆరోపణలు ఉన్నాయనే సంగతి తెలుసా. అతడితో ఈ షోలో పాల్గొనడం మీకు కంఫర్టబుల్ గా ఉంటుందా అని ప్రశ్నించారా అని చిన్మయి మండిపడింది. దీనితో షో నిర్వాహకులు మాట్లాడడానికి నిరాకరించారు. 

PREV
click me!

Recommended Stories

VD14: విజయ్‌ దేవరకొండ వీడీ 14 నుంచి గూస్‌ బంమ్స్ అప్‌ డేట్‌.. రౌడీ బాయ్స్ కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చినట్టే
రెమ్యునరేషన్ లేకుండా మహేష్ చేసిన సినిమా ఏదో తెలుసా.? హీరోగా చేసింది పవన్ కళ్యాణ్..