
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తొలి స్టైట్ తెలుగు చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 17న రిలీజై మంచి విజయం సొంతం చేసుకుంది. ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.
విద్యా వ్యవస్థపై ఆలోచింపజేసేలా దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని రూపొందించారు. ధనుష్ అద్భుతమైన నటనతో మెప్పించాడు. ఫలితంగా ఈ చిత్రం నిర్మాతకి లాభాలు తెచ్చిపెడుతోంది. ఇదిలా ఉండగా నటసింహం నందమూరి బాలకృష్ణకి సార్ మూవీ తెగ నచ్చేసింది.
నిర్మాత నాగ వంశీ బాలయ్య కోసం సార్ ప్రత్యేకమైన షో ప్రదర్శించారు. ఈ చిత్రం చూసిన అనంతరం బాలయ్య దర్శకుడిని, నిర్మాతని, నటీనటుల్ని అభినందించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 'సార్ చిత్రం చూసి అభినందించిన బాలయ్య గారికి కృతజ్ఞతలు. మీ రెస్పాన్స్ చూసి మేము థ్రిల్ అయ్యాం అని ట్వీట్ చేశారు.
బాలకృష్ణ గురువారం రోజు నందమూరి తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమంతో బిజీగా గడిపారు.బాలయ్య చివరగా వీరసింహారెడ్డి చిత్రంతో సూపర్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు.