Jailer : రజినీకాంత్ క్రేజ్.. ‘జైలర్’ రిలీజ్ రోజు ఉద్యోగులకు పండుగే..

By Asianet News  |  First Published Aug 7, 2023, 6:57 PM IST

తమిళ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ‘జైలర్’ రిలీజ్ సందర్భంగా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్ చెప్పాయి. 
 


సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)  అభిమానులు ఆయన సినిమాల కోసం ఎంతలా ఎదురుచూస్తారన్నది తెలిసిందే. ఇక రిలీజ్ రోజు వారు చేసే రచ్చ అంతాఇంతా ఉండదు. అన్ని ఏజ్ గ్రూప్స్ లో రజినీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ ‘జైలర్’ (Jailer)తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమన్నా భాటియా (Tamannaah) కథానాయిక. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఇక చిత్రం గురించి అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదరుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీని అందిన అప్డేట్స్ కు నెక్ట్స్ లెవల్లో హైప్ క్రియేట్ అయ్యింది. ఆగస్టు 10న భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఆడియెన్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులకు కొన్ని కంపెనీలు సూపర్ న్యూస్ అందించాయి. 

Latest Videos

‘జైలర్’ సినిమా రిలీజ్ రోజు ఉద్యోగులకు సెలవు ప్రకటించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా టిక్కెట్లను కూడా అందించనున్నారంట. అయితే బెంగళూరు, చెన్నైలోని కొన్ని కంపెనీలు మాత్రమే తమ ఎంప్లాయీస్ కు ఈ సౌకర్యాన్ని కల్పినట్టు న్యూస్ వైరల్ గా మారాయి. దీంతో రజినీ అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

ఏదేమైనా ‘జైలర్’తో రజినీ యాక్షన్ అండ్ మాస్ అవతార్ లో రచ్చ చేయబోతున్నారు. ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. రీసెంట్ గా విడుదలైన ‘నువ్వు కావాలయ్యా‘ సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ వెంటనే వచ్చిన ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఆ తర్వాత రోజునే చిరు ‘భోళా శంకర్’ కూడా విడుదల కానుండటం విశేషం. 

click me!