స్టార్ హీరోయిన్ పై చీటింగ్ కేసు!

Published : Jul 12, 2019, 09:51 AM IST
స్టార్ హీరోయిన్ పై చీటింగ్ కేసు!

సారాంశం

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్, మాజీ ఎంపీ శత్రుఘ్నసిన్హా గారాలపట్టి సోనాక్షి సిన్హాపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్, మాజీ ఎంపీ శత్రుఘ్నసిన్హా గారాలపట్టి సోనాక్షి సిన్హాపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది ఓ స్టేజ్ ప్రదర్శన ఇవ్వడానికి సోనాక్షి సిన్హా రూ.24 లక్షలు తీసుకొని కార్యక్రమానికి రాలేదని నిర్వాహకులు యూపీలోని కట్ ఘర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో యూపీ పోలీసులు సోనాక్షి సిన్హాపై ఐపీసీ సెక్షన్ 420, 406 ల కింద కేసు నమోదు చేశారు. చీటింగ్ కేసు దర్యాప్తు చేయడానికి ఉత్తరప్రదేశ్ నుండి ఓ స్పెషల్ పోలీస్ టీమ్ గురువారం సాయంత్రం ముంబైలోని సోనాక్షి సిన్హా ఇంటికి వచ్చింది.

కానీ ఆ సమయంలో సోనాక్షిసిన్హా ఇంట్లో లేరని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ మాజీ ఎంపీ అయిన సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా గత లోక్ సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తరఫున అభ్యర్ధిగా పోటీ చేశారు.

కానీ ఆయన ఓటమి పాలయ్యారు. అతడి భార్య సమాజ్ వాద్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల సమయంలో సోనాక్షి తన తల్లి తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఆమెపై యూపీ పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

Allu Aravind: చిరంజీవి రీఎంట్రీ తర్వాత బెస్ట్ ఫిల్మ్ ఇదే.. మన శంకర వరప్రసాద్‌ గారు మూవీపై అరవింద్‌ క్రేజీ రివ్యూ
Sobhita: ప్రెగ్నెన్సీ వార్తలపై అదిరిపోయే క్లారిటీ ఇచ్చేసిన శోభితా.. ఇప్పుడు ఫోకస్‌ అంతా అటు షిఫ్ట్