ఛార్మితో పూరీ నూరేళ్ల బంధం

Published : Feb 14, 2017, 10:53 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ఛార్మితో పూరీ నూరేళ్ల బంధం

సారాంశం

పూరీ జగన్ వ్యవహారాలన్నీ గతంలో చూసిన ఛార్మి ఛార్మిని గత కొంత కాలంగా పూరీ దూరంపెట్టాడని రూమర్స్ అపోహలు తొలగిస్తూ ఛార్మితో తన అనుబంధాన్ని చాటిన పూరీ

తెలుగు స్టార్ దర్శకుల్లో ఒకడైన పూరీ జగన్నాథ్‌ ఆమధ్య తన టీమ్‌ని మొత్తం మార్చేసాడు. తన కార్యాలయంలో పనిచేసే ఆఫీస్‌ బాయ్‌ సహా మొత్తం అందరినీ తీసేసి కొత్త టీమ్ ను నియమించుకున్నాడు. సేమ్‌ టీమ్‌ వుంటే సేమ్‌ ఆలోచనలే వస్తున్నాయని, ఆ టీమ్‌లో కూడా అలసత్వం వచ్చేసిందని, అంతా గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారని, దాని ప్రభావం తీవ్రంగా పడుతోందని గతంలో పూరి చెప్పాడు. అప్పుడే తన ఆఫీస్ వ్యవహారాలని చూసే ఛార్మిని కూడా పూరి పంపించేసాడని వార్తలొచ్చాయి. 


అయితే ఛార్మి మరోసారి పూరి జగన్నాథ్‌ ఆఫీస్‌లో యాక్టివ్‌ మెంబర్‌ అయిందని తెలుస్తోంది. పూరి జగన్నాథ్‌ సినిమాలకి కాస్టింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోందని ఆమధ్య బాగా వినిపించింది. పూరికి దిశా పటానిని పరిచయం చేసింది కూడా ఛార్మియేనని ప్రచారం జరిగింది. ఇజం చిత్రంలో ఫిమేల్‌ ఆర్టిస్టులని సెలక్ట్‌ చేసిందీ ఛార్మినే అంటూ వార్తలొచ్చాయి. వాటిని పూరి, ఛార్మి ఇద్దరూ ఖండించలేదు.

 

తాజా సమాచారం ప్రకారం పూరి తన తదుపరి చిత్రం 'రోగ్‌' పబ్లిసిటీ వ్యవహారాలన్నీ ఛార్మికే అప్పగించాడట. సినిమా పోస్టర్లు ఓకే చేయడం దగ్గర్నుంచి, ఛానల్‌ యాడ్స్ పై ఛార్మియే నిర్ణయిస్తుందట. పబ్లిసిటీ విషయంలో ఛార్మికి సర్వాధికారాలు ఇవ్వాలని నిర్మాత మనోహర్‌కి పూరీ చెబితే ఆయన కాదనకుండా ఛార్మికి పబ్లిసిటీ బడ్జెట్‌తో పాటు కొందరు మనుషుల్ని కూడా అప్పగించాడట. అలా విడిపోయారనుకున్న వీళ్లిద్దరి బంధం చెక్కుచెదరలేదని అంతా అనుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్