నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. క్రికెటర్‌గా ఎదగాలని ఆశ పడే ఓ యువకుడు తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు దర్శకుడు ఎంతో నాచురల్ గా చూపించాడు. ఈ సినిమాను నాని తన నటనతో ఒక స్దాయికు తీసుకెళ్లాడు.ఈ సినిమా సక్సెస్ తో గౌతమ్ పేరు ఒక్కసారిగా టాలీవుడ్‌లో మారుమోగింది. దాంతో ఆయన నెక్ట్స్ ఏ తెలుగు హీరోతో చేయబోతున్నాడనే విషయమై అంతటా వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గౌతమ్‌కు లక్కీ ఛాన్స్ ఇచ్చినట్లు చెప్పుకున్నారు. అయితే అందులో నిజం లేదని తెలిసింది.

రామ్ చరణ్ ని కొద్ది రోజుల క్రితం స్క్రిప్టుతో ఎప్రోచ్ అయిన గౌతమ్ కు రామ్ చరణ్ నో చెప్పారట. అయితే స్క్రిప్టు నచ్చక కాదట. తాను ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, శంకర్ తో చేస్తున్న పాన్ ఇండియా పూర్తయ్యే సరికి సమయం పడుతుందని, అంతకాలం వేచి ఉండటం కన్నా వేరే హీరోతో ముందుకు వెళ్లటం మంచిదని సూచించారట. కాగా, చెర్రీ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తన స్క్రిప్టుకు సరపడే హీరో అల్లు అర్జున్ అని భావించిన గౌతమ్ ఆయన్ను ఎప్రోచ్ అవుతున్నారట. త్వరలోనే మీటింగ్ ఉంటుందని, అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే సంవత్సరం మధ్యలో ప్రాజెక్టు ప్రారంభమయ్యే అవకాసం ఉందని వినికిడి.
ఇక ‘జెర్సీ’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ప్రస్తుతం ఆయన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా అల్లు అరవింద్- దిల్ రాజు కలిసి సంయుక్తంగా ఈ రీమేక్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.