వావ్.. అంచనాలు పెంచేస్తున్న 'చంద్రముఖి 2' సాంగ్ ప్రోమో.. కీరవాణి డ్యూటీ ఎక్కేశారు

Published : Aug 05, 2023, 08:24 PM IST
వావ్.. అంచనాలు పెంచేస్తున్న 'చంద్రముఖి 2' సాంగ్ ప్రోమో.. కీరవాణి డ్యూటీ ఎక్కేశారు

సారాంశం

చంద్రముఖి2 టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. లిరికల్ ప్రోమో మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉంది. చంద్రముఖిని వర్ణిస్తూ లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. జ్యోతిక టైటిల్ రోల్ పోషించిన చిత్రం చంద్రముఖి అప్పట్లో ఒక సంచలనం. పి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం కథా బలం, రజనీకాంత్ స్టార్ పవర్, జ్యోతిక నటనతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా చంద్రముఖి 2 వస్తోంది. అయితే సీక్వెల్ లో రజనీ నటించడం లేదు. రాఘవ లారెన్స్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. 

ఇక చంద్రముఖి పాత్రలో లేడీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తోంది. అప్పుడే కంగనా జ్యోతిక స్థాయిలో మెప్పిస్తుందనే పోలికలు కూడా మొదలైపోయాయి. వినాయక చవితి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే కంగనా, లారెన్స్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్స్ కి ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. 

తాజాగా చంద్రముఖి2 టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. లిరికల్ ప్రోమో మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉంది. చంద్రముఖిని వర్ణిస్తూ లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. చంద్రముఖి స్వాగతాంజలి అంటూ సాగే ఈ కంప్లీట్ సాంగ్ ని త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ ప్రోమో చూస్తుంటే కీరవాణి అల్రెడీ డ్యూటీ ఎక్కేసి మ్యాజిక్ చేయడం మొదలు పెట్టారనిపిస్తోంది. సాంగ్ ట్యూన్ అంత అద్భుతంగా ఉంది. 

చంద్రముఖి చిత్రం అంత ఘనవిజయం సాధించింది అంటే అందుకు కారణాలలో సంగీతం కూడా ప్రధానంగా ఉంటుంది. ఆ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించారు. ఇప్పుడు చంద్రముఖి 2కి కీరవాణి బాణీలు ఇస్తున్నారు. మరి ఈ చంద్రముఖి ఆటా పాటా ఎలా ఉంటుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

రాజాసాబ్ చేయకుండా తప్పించుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా? ప్రభాస్ ను బుక్ చేశారుగా
The Raja Saab 6 Days Collection: ది రాజాసాబ్‌కి ఆరో రోజు పెరిగిన కలెక్షన్లు.. ప్రభాస్‌ టార్గెట్‌కి ఎంత దూరంలో ఉన్నాడంటే