బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం ఆవిష్కరణ..జమదగ్ని రూపంలో, ఎవరెవరు హాజరయ్యారంటే..

Published : Aug 05, 2023, 07:05 PM IST
బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం ఆవిష్కరణ..జమదగ్ని రూపంలో, ఎవరెవరు హాజరయ్యారంటే..

సారాంశం

నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గత ఏడాది నవంబర్ లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. బుల్లిపాలెం నుంచి వచ్చిన ఈ బుల్లోడు వెండితెరపై చేసిన అద్భుతాలు, సాహసాలు అన్నీ ఇన్నీ కావు. కృష్ణ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసారు.

నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గత ఏడాది నవంబర్ లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. బుల్లిపాలెం నుంచి వచ్చిన ఈ బుల్లోడు వెండితెరపై చేసిన అద్భుతాలు, సాహసాలు అన్నీ ఇన్నీ కావు. కృష్ణ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసారు. కృష్ణ మరణం తర్వాత ఆయన జ్ఞాపకార్థం బుర్రిపాలెం గ్రామస్థులు, అభిమానులు కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. 

ఈ విగ్రహావిష్కరణకు కృష్ణ ఫ్యామిలీ నుంచి పలువురు హాజరు కావడం విశేషం. శనివారం రోజు జూలై 5 న ఈ కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ కుమార్తెలు మంజుల, పద్మావతి, ప్రియదర్శిని.. అల్లుడు సుధీర్ బాబు, డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, సోదరుడు ఆదిశేషగిరి రావు హాజరయ్యారు. 

విగ్రహావిష్కరణ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన అగ్నిపర్వతం చిత్రంలోని జమదగ్ని పాత్ర రూపంలో ఆయన విగ్రహాన్ని గ్రామస్థులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సొంత ఊరు కోసం కృష్ణ చేసిన కార్యక్రమాలని గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. 

ఈ కార్యక్రమంలో ఎస్వీ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. తాను సూపర్ స్టార్ తో నెం 1 అనే చిత్రం తెరకెక్కించాను అని అన్నారు. తన మనసులో కృష్ణగారే ఎప్పటికీ నంబర్ 1 అని అన్నారు. 350 పైగా చిత్రాల్లో నటించిన ఘనత ఆయనది. ఈ విగ్రహాన్ని చూస్తుంటే కృష్ణ గారు మన పక్కనే ఉన్నట్లు ఉంది అని అన్నారు. సుధీర్ బాబు మాట్లాడుతూ కృష్ణ గారి లెగసి ని కొనసాగించే భాద్యత మహేష్ బాబుతో పాటు తనపై కూడా ఉందని అన్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో మంచి సినిమాలు చేస్తానని సుధీర్ బాబు అన్నారు. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం