Chandramukhi 2 : వినాయక చవితికి ‘చంద్రముఖి 2’ రిలీజ్.. అఫీషియల్ అప్డేట్

By Asianet News  |  First Published Jun 29, 2023, 6:21 PM IST

రాఘవ లారెన్స్ - బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ నటించిన ‘చంద్రముఖి 2’ నుంచి బిగ్ అప్డేట్ అందింది. మేకర్స్ చిత్ర రిలీజ్ ఎప్పుడనేది అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 
 


18  ఏళ్ల తరువాత ‘చంద్రముఖి’ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇంత లేట్ గా సీక్వెల్ వస్తున్నప్పటికీ అంచనాలు కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నాయి. కాకపోతే అప్పుడు రజనీకాంత్, నయనతార నటించగా..  ఆ ప్లేస్ లో స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ , బాలీవుడ్ స్టార్ బ్యూటీ కంగనా రనౌత్ (Kangana Ranaut)  నటించారు. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. 

డైరెక్ట‌ర్ పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 65వ సినిమా ఇది. అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా భారీ బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న ‘చంద్రముఖి 2’ చిత్రం రిలీజ్ పై కొద్దిరోజులు బజ్ వినిపిస్తూనే ఉంది. ఇక తాజాగా మేకర్స్  బిగ్ అప్డేట్ అందించారు. చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేయబోతున్నట్టు అఫీషియల్ అప్డేట్ అందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. చిత్రానికి ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ మూవీకి ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట త‌ర‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, ఆంథోని ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. 

Latest Videos

ఇక 2005లో వచ్చిన చంద్రముఖి సౌత్ ఆడియన్స్ కు ఓ డిఫరెంట్ హర్రర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ ను అందించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం కూడా హార్రర్ కామెడీ చిత్రాలపై ప్రేక్షకులకు ఆసక్తి చూపుతూనే ఉన్నారు. కొద్దికాలంగా వీటి సంఖ్య తగ్గింది. ఈ క్రమంలో ‘చంద్రముఖి 2’పై భారీ అంచనాలు పెరగాయి. ఎట్టకేళలకు వినాయక చవితికి చంద్రముఖి గది తలుపులు తెరుచుకోబోతున్నాయి. ప్రేక్షకులను మెప్పించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. 

 ఈ సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాస్క‌ర‌న్ మాట్లాడుతూ ‘‘ఇండియన్ మూవీ హిస్ట‌రీలో ‘చంద్రముఖి’కి ఓ ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. దానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాం. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను మించేలానే మూవీ ఉంటుంది. వినాయ‌క చ‌వ‌తి సంద‌ర్భంగా ‘చంద్రముఖి 2’ సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ఇక ఈ చిత్రంలో వ‌డివేలు, ల‌క్ష్మీ మీన‌న్‌, మ‌హిమా నంబియార్‌, రాధికా శ‌ర‌త్ కుమార్‌, విఘ్నేష్‌, ర‌విమారియ, శృష్టి డాంగే, శుభిక్ష‌, వై.జి.మ‌హేంద్ర‌న్ రావు ర‌మేష్‌, సాయి అయ్య‌ప్ప‌న్, సురేష్ మీన‌న్‌, శత్రు, టి.ఎం.కార్తీక్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

We are thrilled to announce that the doors to the much awaited sequel Chandramukhi 2 🗝️ will be open from Ganesh Chaturthi 🤗✨

Releasing in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada! 🗝️
🎬
🌟
🎶
🎥
🛠️… pic.twitter.com/GijUxUA2OP

— Lyca Productions (@LycaProductions)
click me!